టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ “కూర్మనాయకి”. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.
వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనను పుట్టినరోజు విశెస్ తో ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది కూర్మనాయకి టీమ్. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా “కూర్మనాయకి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు – వరలక్ష్మీ శరత్ కుమార్, శివాజీ, సాయి కుమార్, అతిరారాజ్, సప్తగిరి, గెటప్ శ్రీను, మహేశ్ విట్టా, సరయు, శత్రు, వీటీవీ గణేషన్, రాజా రవీంద్ర, రాజ్ కృష్ణ, తాగుబోతు రమేష్, తదితరులు
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
సినిమాటోగ్రఫీ – రామ్
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్),వంశీ శేఖర్
నిర్మాత – కె విజితా రావ్
సహ నిర్మాతలు – స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ
రచన దర్శకత్వం – హర్షవర్థన్ కడియాల
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…