‘కుబేర’ కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

గత నెలలో ఫస్ట్‌లుక్‌ విడుదలైన తర్వాత ‘కుబేర’పై ఎక్సయిట్మెంట్ రెట్టింపైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుండి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా ‘కుబేర’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్, నాగార్జునలను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్)  బ్యానర్‌పై శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న కథానాయిక.  సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

సినిమా చుట్టూ ఉన్న బజ్‌ని దృష్టిలో ఉంచుకుని, శేఖర్ కమ్ముల అండ్ టీమ్ చాలా జాగ్రత్తతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మాగ్నమ్ ఓపస్ కోసం ఈ మ్యాసీవ్ షెడ్యూల్ 12 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రదేశాలలో షూట్ చేస్తున్నారు. ఇది కీలకమైన, లెన్తీ షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో ధనుష్, రష్మిక మందన్న, ఇతరులతో కూడిన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు చిత్రీకరిస్తున్నారు.  విజువల్స్ చాలా అద్భుతమైన ఉండబోతున్నాయి. టీమ్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో ధనుష్ వాటర్ పైప్‌లైన్ పైన నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేస్తోంది.

ఈ ఏడాది వస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో హై బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో కుబేర ఒకటి. ఇంతకుముందు సెన్సిబుల్, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ముల అన్ని కమర్షియల్ హంగులను సరైన నిష్పత్తిలో కలిగి ఉండే కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు.  ధనుష్, నాగార్జున అభిమానులు తమ అభిమాన స్టార్స్ ని కలిసి తెరపై చూడాలని క్యురియాసిటీతో ఉన్నారు. ధనుష్, నాగార్జున పాత్రలతో పాటు రష్మిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.  

తారాగణం: ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన, జిమ్ సర్భ్ తదితరులు

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
సమర్పణ: సోనాలి నారంగ్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాతలు: సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: నికేత్ బొమ్మి
సహ రచయిత: చైతన్య పింగళి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago