‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుని పద్యం విడుదల

వైల్డ్ వర్ట్యూ క్రియేషన్స్ పతాకం పై చైతన్య కృష్ణ, మాయ నెల్లూరి, సాష సింగ్, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి మరియు డాక్టర్ వెంకట గోవాడ ముఖ్య తారాగణం తో సురేష్ పళ్ళ స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కృష్ణ ఘట్టం’. ఈ చిత్రానికి మూడి క్రాబ్ ఫిలిం ఫెస్టివల్ (Moody Crab Film Festival) వారు 2022 లో బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డు (Best Feature Film Award) తో సత్కరించారు. అలాగే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మాస్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసి ట్రైలర్ చాలా బాగుంది అని ప్రశంసించారు.

అయితే ఈ రోజు కృష్ణాష్టమి పండుగ సందర్భంగా చిత్రం లోని కృష్ణుడి పద్యాన్ని విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత సురేష్ పల్లా మాట్లాడుతూ “కృష్ణాష్టమి పండుగ సందర్భంగా మా ‘కృష్ణ ఘట్టం’ చిత్రం నుంచి కృష్ణుడి పద్యాన్ని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సర్వలోక రక్షకుడు అయిన కృష్ణుడిని ఎవరు ఎప్పుడు ఎలా పిలువగలరు అని ఓ భక్తుడు అడిగిన ప్రశ్న కి శ్రీ కృష్ణుడు ఇచ్చిన సమాధానమే ఈ పద్యం.

ఈ అచ్చ తెలుగు పద్యం కృష్ణుడి భక్తులకు పండగలా ఉంటుంది. ఒక దశాబ్ద కాలం లో ఇలాంటి తెలుగు పద్య నాటకం మన తెలుగు చిత్రంలో ఎన్నడూ రాలేదు. ఈ పద్యం కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడికి నైవేద్యం లాంటిది.

మా ఈ పద్యాన్ని 30 సంవత్సరాలుగా కృష్ణుడి వేషం వేస్తూ తెలుగు పద్యనాటకాలు చేస్తున్న గుమ్మడి గోపాలకృష్ణ గారు విడుదల చేశారు. అయన మా చిత్ర ట్రైలర్ మరియు పద్యానటకం చూసి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు.  మా చిత్రాని త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు

చిత్రం పేరు : కృష్ణ ఘట్టం

తారాగణం: చైతన్య కృష్ణ, మాయ నెలూరి, సాషా సింగ్, DR.వెంకట్ గోవాడ, దువ్వాసి మోహన్, వినయ్ నల్లకడి, విశ్వనాథ్ GR, బొంబాయి పద్మ, ప్రసన్న కెంబూరి.

టెక్నిషన్స్:

రచన, దర్శకత్వం మరియు నిర్మాత: సురేష్ పల్లా
సంగీతం: పి ఆర్(PR)
సినిమాటోగ్రఫీ: సూర్య వినయ్
బ్యానర్: వైల్డ్ వాల్చుర్ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్: బొంబాయి పద్మ
ఎడిటింగ్: వినయ్
కాస్ట్యూమ్ డిజైనర్: సుదీప్తి, బాంబే పద్మ & టీమ్
VFX: శివ (రైజ్ స్టూడియో), అనుజ్ (ప్లానెట్ గ్రీన్ స్టూడియో)
కో-డైరెక్టర్: శివ
కళా దర్శకుడు: రాజేష్, సురభి రాయల
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : విజయ్ నాగ్ యార్లగడ్డ

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago