టాలీవుడ్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మరో అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో

టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ఈ రోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా సంఘం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. తెలంగాణ సినీ కార్మికులు సభ్యులుగా ఉన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం రెంట్ తీసుకుని నిర్వహిస్తున్నాం. ఫిలింనగర్ లో 800 గజాల స్థలం ఇప్పించగలరని కోరుతున్నాం. ఆ స్థలంలో సొంత కార్యాలయం నిర్మించుకుంటాం. నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాల పైన అవుతుంది. 40 సినిమాల వరకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఎనిమిది సినిమాలో డైరెక్షన్ చేయడం జరిగింది, అలాగే 250 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం చేశాను. .మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఏ ఒక్క కార్మికునికి కూడా చిత్రపురి కాలనీలో ఇల్లు ఇవ్వలేదు, కాబట్టి మా చాంబర్లో ఉన్న కార్మికులందరికీ ఇల్లు ఇప్పించాలని కోరుతున్నాను. మా తెలంగాణలో ఉండే కొందరు బడా నిర్మాతలు మంత్రి గారి పి ఏ లకు ఫోన్ చేసి మంత్రిగారిని ఫంక్షన్కు రాకుండా చూసుకోండి అని చెప్పారు, అయినా ఎవ్వరిని లెక్కచేయకుండా మంత్రిగారు మా ప్రోగ్రాంకు రావడం నిజంగా చాలా చాలా సంతోషం. రావడమే కాదు మేము అడిగిన కోరికలన్నీ తీరుస్తానని చెప్పారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు. కానీ చిన్న చిత్రాలకు టికెట్ రేట్స్ హైక్ అవసరం లేదు. థియేటర్స్ లో చిన్న సినిమా రిలీజ్ కు క్యూబ్, యూఎఫ్ వో వంటి కంటెంట్ ప్రొవైడర్స్ కు తమిళనాట 2500 ఉంటే మన దగ్గర 10 వేలు వసూలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు మద్ధతుగా ఉన్నారు. నేను గతంలో నిరాహార దీక్ష చేస్తే 3 వేల వరకు ఈ ఛార్జీలు తగ్గించారు. ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకోవాలి. అలాగే చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు. మా సభ్యుల్లో కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలని కోరుతున్నా అన్నారు.

టీఎఫ్ సీసీ వైస్ ప్రెసిడెంట్ గురురాజ్ మాట్లాడుతూ – మంచితనానికి మారుపేరు మా మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆయన ఈ రోజు మా ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద నుంచి మంత్రి గారికి ఒక విన్నపం చేస్తున్నాం. చిత్రపురి కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వాటిపై మీరు దృష్టి సారించాలి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ గారితో మేము జర్నీ చేస్తుండటం సంతోషంగా ఉంది అన్నారు.

టీఎఫ్ సీసీ సెక్రటరీ జేవీఆర్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉంది. ఆయనకు మా అసోసియేషన్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. చిన్న చిత్రాల విడుదల విషయంలో ప్రభుత్వం తమ సహకారం అందించాలి. 200 చిన్న చిత్రాలు నిర్మితమైతే అందులో 10 శాతం కూడా థియేటర్స్ లో రిలీజ్ కావడం లేదు అన్నారు.

టీఎఫ్ సీసీ సెక్రటరీ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ – ఎన్నో బిజీ కార్యక్రమాల్లో ఉండి కూడా మా సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. 2014లో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడింది. సుమారు 16 వేల మంది సభ్యులు 24 విభాగాల నుంచి ఉన్నారు. వారి సంక్షేమం కోసం మా అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాల్లో ప్రభుత్వం తరుపున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాం అన్నారు

టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్ మాట్లాడుతూ – ముందుగా మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం మాకెంతో ప్రోత్సాహాన్ని బలాన్ని ఇస్తోంది. ఈ ప్రభుత్వం మా టీఎఫ్ సీసీ సభ్యుల సంక్షేమానికి సపోర్ట్ అందిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.

నటి కవిత మాట్లాడుతూ – రామకృష్ణ గౌడ్ గారిలో తోటి వారికి సహాయం చేయాలనే తపన ఉంటుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో నేను చూసిన ప్రత్యేకత ఏంటంటే కొత్త వాళ్లు ఎవరైనా సినిమా చేయాలని వస్తే ప్రతి విషయంలో ఈ సంస్థ సభ్యులు సహకారం అందిస్తారు. ప్రారంభం నుంచి సెన్సార్ వరకు సపోర్ట్ చేస్తారు. ఇలాంటి అసోసియేషన్ మరింతగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా అన్నారు.

టీ మా సెక్రటరీ స్నిగ్ధ మాట్లాడుతూ – మా అసోసియేషన్ తరుపున నటీనటులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా వంతు పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మహిళా ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో ఎప్పుడు సమస్య వచ్చినా మా దగ్గరకు రావొచ్చు. కొత్త నటీనటులకు మరింతగా అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నా. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రభుత్వం తరుపున తమ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

హీరో కిరణ్ మాట్లాడుతూ – నాకు సినిమా అంటే ప్రాణం. సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదు. నేను తెలుగులో 22, తమిళంలో 2 చిత్రాల్లో నటించాను. సినిమా కోసం ఎంతో కష్టపడినా అవి థియేటర్స్ లో రిలీజ్ కు నోచుకోలేదు. ఎంతో బాధగా ఉండేది. చిన్న చిత్రాల థియేట్రికల్ రిలీజ్ విషయంలో ప్రభుత్వం తమ చొరవ చూపించాలి అన్నారు.

ప్రసాద్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ – తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ఎన్నికైన సభ్యులకు నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. తెలుగు సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చుకుంటోంది. సొసైటీకి మంచి ఆలోచనలు చెప్పేందుకు సినిమాను మించిన గొప్ప మాధ్యమం లేదు. ఆ క్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా భాగమవడం ఆనందంగా ఉంది అన్నారు.

సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ – తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఆరోసారి ఛైర్మన్ గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ అసోసియేషన్ ద్వారా వారు ఎంతోమందికి సపోర్ట్ అందిస్తున్నారు. నాకు సినిమాలంటే ఇష్టం. అయితే చిత్ర పరిశ్రమ ఎవరో ఐదారుగురు పెద్ద వారిదే కాదు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదీ. అందరికీ నటన రాదు. వచ్చిన కళాకారులకు మనం సపోర్ట్ గా నిలబడాలి. మా భూమి నుంచి మొన్నటి బలగం వరకు తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. తెలంగాణలో సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందాలనేది మా ప్రభుత్వ సంకల్పం. నా దగ్గరకు థియేటర్స్ ఇప్పించమని వచ్చే ప్రతి చిన్న సినిమా వారికి నా సహకారం అందిస్తున్నా. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు 800 గజాల స్థలం ఇప్పించేందుకు ప్రభుత్వం తరుపున ప్రయత్నం చేస్తాం. అలాగే చిత్రపురి కాలనీలో కొత్తగా కట్టబోయే ఫ్లాట్స్ లో మన తెలంగాణ సినిమా వారికి ఫ్లాట్స్ ఇప్పిస్తాం. మీకు ఏ సహకారం కావాలన్నా ప్రభుత్వం తరుపున గానీ, వ్యక్తిగతంగా నా తరుపున గానీ చేస్తానని హామీ ఇస్తున్నా అన్నారు

Tfja Team

Recent Posts

Hero Kiran Abbavaram’s “Dilruba” Completes Shooting

Young and talented hero Kiran Abbavaram is starring in the upcoming film Dilruba, with Rukshar…

22 hours ago

హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” షూటింగ్ కంప్లీట్,

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్…

22 hours ago

Pandu Chirumamilla’s Bold & First Look Of Premikudu Released

There is a growing demand for films that delve into intense love stories, especially among…

22 hours ago

పండు చిరుమామిళ్ల బోల్డ్ అండ్ ఇంటెన్స్ “ప్రేమికుడు” ఫస్ట్ లుక్ విడుదల

యూత్ బేస్డ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలోని సంఘర్షణ, ఎమోషన్స్ మీద తీసే చిత్రాలు ఎవర్గ్రీన్…

22 hours ago

SYE” is ready for re-release in theaters on Jay 1st 2025

Tollywood hero Nithin in the lead role and directed by SS Rajamouli, the sports action…

2 days ago

జనవరి 1, 2025 న థియేటర్ల లో రీ రిలీజ్ కి రెడీ అయిన బ్లాక్ బస్టర్ మూవీ “సై” !!!

టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్…

2 days ago