కోలాహలంగా కోడి రామకృష్ణ జయంతి వేడుకలుహీరో సుమన్ కు “నట కేసరి” బిరుదు ప్రదానం!!

శతాధిక చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ జయంతి వేడుకలు హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగాయి. వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సారథ్యంలో నిర్వహించిన ఈ వేడుకలో సినిమా రంగంతోపాటు… ఉభయ రాష్ట్రాలలోని పలు రంగాల్లో సేవలు చేస్తున్న సామాజిక సేవాతత్పరులు, ప్రతిభావంతులకు ఘన పురస్కారాలు అందించారు. తెలుగు సినిమా రంగంలో సుష్టిర స్థానం సంపాదించుకున్న కోడి రామకృష్ణ పేరు ఉభయ రాష్ట్రాల్లో నిలిచేల చేయడం ఈ పురస్కారాల ముఖ్య ఉద్దేశ్యమని కార్యక్రమ సారథి – ప్రముఖ నిర్మాత

తుమ్మలపల్లి రామసత్యనారాయణ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు సుమన్ కి “నట కేసరి” బిరుదు ప్రదానం చేశారు. కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య, తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ కూర్మాచలం, ప్రముఖ నటులు మురళి మోహన్, బాబు మోహన్, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు ,సీనియర్ నటిమణులు రోజారమణి, కవిత, పెళ్ళిపుస్తకం దివ్యవాణి, వంశీ రామరాజు, ప్రముఖ వ్యాపారవేత్త బండారు సుబ్బారావు, మద్దుల ప్రకాష్, విజయలక్ష్మి, నంద కుమార్, రాయవరపు భాను ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. “విరూపాక్ష” దర్శకుడు కార్తీక్ వర్మ దండు, “సామజవరగమన” దర్శకుడు రామ్ అబ్బరాజు, కథా రచయిత భాను, “అనుకోని ప్రయాణం” దర్శకుడు వెంకట్ పెదిరెడ్ల, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు తదితరులు పురస్కారాలు అందుకున్నారు.

ఈ సందర్భంగా అతిథులు, పురస్కార గ్రహీతలు… కోడి రామకృష్ణ గొప్పతనాన్ని కొనియాడి, ఆయనకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమ నిర్వాహాకులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, విబిజి రాజు, కొత్త వెంకటేశ్వరరావులకు అభినందనలు తెలియజేసారు!!

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago