సంయుక్త సమర్పణలో కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో “కీప్ ది ఫైర్ అలైవ్”

లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే “కీప్ ది ఫైర్ అలైవ్”. ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యం. యదార్థసంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పే సారాంశం. ఈ ప్రేక్షక సమాజం తనవైపు చూసి ఆలోచించే కంటెంట్ ఉంది కాబట్టే బ్యూఐటిఫుల్ హీరోయిన్ సంయుక్త
ను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను సంయుక్త ప్రెజెంట్ చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రచయిత దర్శకుడు కే ప్రఫుల్ చంద్ర మాట్లాడుతూ.. నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాలు మన కోపానికి కారణం అవుతాయి. వాటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బాధతో పాటు కోపాన్ని కలిగిస్తాయి. వాటిని అధిగమించాలంటే కఠినమైన చట్టాలు తీసుకొస్తే సరిపోతుందా అంటే కచ్చితంగా కాదు. వీటి కన్నా స్పృహ అత్యంత ముఖ్యమైనది. మనందరం మనుషులం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. కానీ మారుతున్న కాలంతో పాటు మనం కొన్ని విలువలు మర్చిపోయాము.

మళ్లీ మనుషులుగా మనమంతా ఒకే తాటిపై నిలబడితే ఎలాంటి అరాచకాలకు తావుండదు. కచ్చితంగా రేపటి కోసం ఒక అడుగు అందరమూ వేయాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది. భారతదేశానికి స్వతంత్రం కావాలి అని 1743లో మొదట కోరిన వ్యక్తి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని ఆస్వాదించలేదు కానీ ఆయన ఆశయం నెరవేరింది. అలాగే సమాజంలో మార్పు కోసం ఈరోజు మనము ఒక అడుగు వేయాలి. ఆ మార్పు ఫలాలు భవిష్యత్ తరాలు కచ్చితంగా అనుభవిస్తాయి. అనే పాయింట్ తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాము అన్నారు.

ఈ షార్ట్ ఫిలిం కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మౌర్య ఇలా అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టారు. ఒక చిత్రకారుడి పెయింటింగ్ ల ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చూపించారు. చేరుబ్ శిర్షత్ అందించిన సంగీతం ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసింది. గ్యారేజ్ స్టూడియోలో ఎడిటింగ్, విఎఫెఎక్స్ చేసినట్లు చెప్పారు. ఈ షార్ట్ ఫిలిం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడానికి షేక్ హాసన్, అంకిత్ సిద్ధార్థ, సఫా, వినోదుల కృషి ఎప్పటికీ మరువలేనిది. కృషి చెన్నోజు చేసిన లోగో డిజైన్ కథలోని ప్రాణాన్ని ఆవిష్కరించినట్లు ఉందన్నారు. లక్షిత్, చైతన్య డీఐ వర్క్ చాలా బాగుంది అన్నారు.

అండర్ ది సేమ్ స్కై ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించినట్లు చెప్పారు. అలాగే చరణ్ తేజ్ ఉప్పలపాటి, యష్ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా చరణ్ తేజ్ ఉప్పలపాటి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఇలాంటి ఈ గొప్ప ప్రయత్నానికి సంయుక్త తో రావడం అద్భుతం అని చెప్పవచ్చు. ఆమె వాయిస్ ఓవర్ లో ప్రతి పదం ఒక అగ్ని కణంలో ఉంటుందని ప్రేక్షకుడి హృదయానికి అంటుకుంటుందని చెప్పారు. ఈ షార్ట్ ఫిలిం మళ్లీ మళ్లీ చూసేలా సంయుక్త గొంతు మ్యాజిక్ చేసిందని చెప్పారు.

ఇది సమయంలో సంయుక్త కూడా ఆదిశక్తి అనే ఫౌండేషన్ ను స్థాపించి మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేయాలని సంకల్పంతో అడుగులు వేస్తోంది. అందుకే మా షార్ట్ ఫిలిం సంయుక్త హృదయానికి అత్యంత చేరమైంది. కచ్చితంగా అందరం కలిసి మార్పు కోసం ఒక అడుగు వేస్తే సమాజంలో స్త్రీలపై ఎలాంటి దాడులు జరగవు. మా షార్ట్ ఫిలిం కచ్చితంగా ఒక మేలుకొలుపు అని కె ప్రఫుల్ చంద్ర అన్నారు.

ఇది కేవలం ప్రేక్షకులను అలరించే కథాంశం మాత్రమే కాదు మేల్కొల్పే సారాంశం. ఈ లఘు చిత్రంలో వాడిన ప్రతి సన్నివేశం ప్రతి మెటఫర్ సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. స్త్రీల సమస్యపై ప్రతి గొంతు మాట్లాడాలి. మౌనం సమాధానం కాకూడదు. సమాజంలో ఈ మార్పు తీసుకురావడానికే “కీప్ ది ఫైర్ అలైవ్” ముఖ్య ఉద్దేశం.

Tfja Team

Recent Posts

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్…

6 days ago

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా.…

1 week ago

జియో స్టార్ సరికొత్త కార్యక్రమం ‘సౌత్ బౌండ్’ టీజ‌ర్ విడుద‌ల‌

ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను మెపిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జియో హాట్…

1 week ago

లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌తో తొలి భార‌తీయ సినిమాగా గుర్తింపు పొందిన దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే

యష్ రాజ్ ఫిల్మ్స్ హిస్టారిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ దిల్ వాలే దుల్హ‌నియా లే జాయేంగే (DDLJ) 30 వ‌సంతాల సంద‌ర్బంగా…

1 week ago

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

1 week ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

2 weeks ago