అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో గోకులం గోపాలన్ నిర్మాతగా రొజిన్ థామస్ తెరకెక్కించిన ‘కథనార్’ ట్రైలర్ విడుదల

గోకులం మూవీస్ బ్యానర్ మీద గోకులం గోపాలన్ నిర్మాతగా రొజిన్ థామస్ తెరకెక్కించిన చిత్రం ‘కథనార్’. ఈ సినిమాలో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్ వంటి వారు కీలక పాత్రల్ని పోషించారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘విజ్ఞానం యొక్క రూపం మూలం ఎలా ఉన్నా కూడా.. కాంతూర్ శాలయలో దాన్ని ఆహ్వానిస్తారు.. ఇంద్రజాలాన్ని నేను నమ్మను.. అవగాహనతో రహస్య మార్గాలలో వాళ్లు దాన్ని పరిశోధిస్తున్నారు.. ఎవరి ఊహకి అందని.. అందరూ ఆశ్చర్యంతో చూసే ఒక మాయా జాలం.. మన ఆత్మతో కలిసి మన జ్ఞాపకాలతో ఐక్యం కాబోయే ఒక సంఘటన.. చేర మహారాజుకి కుంచమున్ తరుపున శుభాకాంక్షలు’.. ‘చూసినది విన్నది ఏదీ రాదు.. వచ్చేది ఒక్కటే.. ఆపత్కాలంలో వచ్చే మహా మనిషి అగ్ని ఒక్కటే’.. ‘కరం కలిస్తే ఆప్యాయిత.. కరం వెడిస్తే నాశనమే బలం’.. ‘ఒక శరీరాన్ని అదుపు చేసే ఎక్కువ శక్తిని మీరు నియంత్రించగలిగారు.. ఎలాగా?’.. ‘మేం చెప్పేది నమ్మండి. వేనాడు ఆపదలో ఉంది’.. ‘మాయ.. ప్రపంచమే మాయ’ అంటూ సాగిన డైలాగ్స్‌తో ట్రైలర్ అద్భుతంగా ఉంది.

ఇక ఈ ట్రైలర్‌లో జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్, శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి, కులప్రీత్ యాదవ్‌లను చూపించిన తీరు, ఒక్కో పాత్ర, వారి లుక్‌ను రివీల్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఇక ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉందనిపిస్తోంది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఇండియన్ సినీ లవర్స్‌కి నెవ్వర్ బిఫోర్ అనిపించేలా సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి ఆర్ రామానంద్, రోజిన్ థామస్ రైటర్స్‌గా పని చేశారు. ఈ సినిమాకి నీల్ డి కున్హా కెమెరామెన్‌గా, రాహుల్ సుబ్రహ్మణ్యన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, కృష్ణమూర్తి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు.

నటీనటులు: జయసూర్య, అనుష్క శెట్టి, ప్రభుదేవా, సనూప్ సాన్, శాండీ, దేవిక, నితీష్ భరద్వాజ్, వినీత్, హరీష్ ఉత్తమన్, శ్రీకాంత్ మురళి, కులప్రీత్ యాదవ్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ – గోకులం మూవీస్
నిర్మాత – గోకులం గోపాలన్
సహ నిర్మాతలు – బైజు గోపాలన్, వీసీ ప్రవీణ్
దర్శకత్వం – రోజిన్ థామస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – కృష్ణమూర్తి
రచన – ఆర్ రామానంద్ & రోజిన్ థామస్
డీఓపీ – నీల్ డి కున్హా
ఒరిజినల్ స్కోర్, పాటలు – రాహుల్ సుబ్రహ్మణ్యన్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవ్
ఫిల్మ్ ఎడిటర్ & Vfx డైరెక్టర్ – రోజిన్ థామస్
Vfx సూపర్‌వైజర్ – విష్ణురాజ్
టెక్నాలజీస్ హెడ్- CGI – సెంథిల్ నాథన్
ఆర్ట్ డైరెక్టర్స్ – అజి కుట్టియాని & రాంప్రసాద్
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్లు – షాలం & గోపేష్ శరత్
మేకప్ – రోనెక్స్ జేవియర్
కాస్ట్యూమ్స్ – అనీష్ తొడుపుజ
యాక్షన్ డిజైన్ – రోజిన్ థామస్
స్టంట్స్ – JJ పార్క్ & కలై కింగ్సన్
ప్రొడక్షన్ కంట్రోలర్ – సిద్ధు పనక్కల్
అసోసియేట్ ఎడిటర్ – అఖిల్ సోమనాథ్
సౌండ్ డిజైన్ – సింక్ సినిమా
ఆడియోగ్రఫీ – అజిత్ ఎ జార్జ్
పబ్లిసిటీ డిజైన్ – టెన్‌పాయింట్
స్టిల్స్ – రిష్లాల్ ఉన్నికృష్ణన్
కలరిస్ట్ – లూకాస్
విఎఫ్ఎక్స్, డిఐ స్టూడియో – పోయెటిక్
పీఆర్వో – బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్-ఫణి కందుకూరి)

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

14 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago