కార్తికేయ “భజే వాయు వేగం” మొదటి సాంగ్ ప్రోమో రిలీజ్

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా వస్తున్న “భజే వాయు వేగం” సినిమా టీజర్ ఇటీవల రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు విడుదల చేయగా అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. ఆ ఊపుని కొనసాగిస్తూ చిత్రంలోని మొదటి పాట ‘సెట్ అయ్యిందే’ ఈ నెల 9వ తేదీన ఉదయం 9.09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రోజు ఈ పాట ప్రోమో రిలీజ్ చేశారు. రధన్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ‘సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే నీ వల్లే నా లైఫ్ సెట్టయ్యిందే, సెట్ అయ్యిందే లైఫ్ సెట్ అయ్యిందే, నా లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే..‘ అంటూ సాగిన ఈ 21 సెకన్ల ప్రోమో సాంగ్ ఇంప్రెస్ చేసింది. ఈ ప్రోమోలో కార్తికేయ చేసిన ఎనర్జిటిక్ డాన్స్ స్టెప్స్ హైలైట్ అవుతున్నాయి. ఫుల్ సాంగ్ లో కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంట వైరల్ అవ్వగలిగే ఓ హుక్ స్టెప్ తో ఆకట్టుకోనున్నారు.

“భజే వాయు వేగం” చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను, ట్రైలర్ ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) – రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

8 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

8 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

8 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago