‘సత్యం సుందరం’పై ఆడియన్స్ చూపిస్తున్న లవ్ వెరీ న్యూ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది హీరో కార్తి

Must Read

హీరో కార్తీ, అరవింద్ స్వామి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 28న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలు అందుకోని యునిమాస్ బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

సక్సెస్ మీట్ లో హీరో కార్తీ మాట్లాడుతూ.. ఇది సక్సెస్ మీట్ లా లేదు ఫ్యామిలీ ఫంక్షన్ లా వుంది. మీరంతా ఎంతో ప్రేమతో అప్రిషియేట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంచి సినిమాలు చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తారు. కానీ ‘సత్యం సుందరం’కు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంత ప్రేమని ఇస్తున్న అందరికీ థాంక్ యూ. మీరు చూపించిన లవ్ కి చాలా ఎమోషనల్ అయ్యాను. ముందుగా కే విశ్వనాథ్, బాలచందర్, కమల్ హాసన్, దాసరి గారు లాంటి గొప్పవారికి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా మనికి చిన్నప్పుడే చూపించారు. ఈ కైండ్ అఫ్ సినిమాని మనలోపల పెట్టారు. అందుకే సినిమాని యాక్సప్ట్ చేయడం జరిగింది. కొత్త సినిమాలు చేస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకాని ఈ సినిమా మరోసారి రుజువుచేసింది. అన్ కండీషనల్ లవ్ ని ప్రేక్షకులు చూస్తారని ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సినిమా విజయం ఇలాంటి మరిన్ని సినిమాలు చేయాలనే నమ్మకాన్ని ఇచ్చింది. ఇలాంటి ఎమోషన్స్ జీవితంలో మిస్ అవుతున్నాయని, మళ్ళీ ఆ ఎమోషన్ ని తీసుకొచ్చారని ఆడియన్స్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే లోపల అంత ప్రేమ వుండాలి. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారికి థాంక్ యూ. 96లో ఎలా ప్రేమించాలో చెప్పారు. ఇందులో అన్ కండీషనల్ లవ్ అంటే చూపించారు. అన్నయ్య ఈ కథ విన్న వెంటనే నువ్వు చేయాలని చెప్పారు. ఇది అప్రిషియేషన్స్ తో స్టాప్ అవ్వకూడదు. కమర్షియల్ గా కూడా పెద్ద హిట్ అవ్వాలి. అప్పుడే మాత్రమే నిర్మాతలు ఇలాంటి సినిమాలు తీసుకొస్తారు. ఈ సినిమా నా కోసం కాదు మంచి సినిమా కోసం చూడాలని ప్రేక్షకులని కోరుకుంటున్నాను. చిన్న విషయాలని అప్రిషియేట్ చేయాలని ఒక జనరేషన్ కి ఈ సినిమా ద్వారా చూపించాం. శ్రీదివ్య చేసిన ప్రతి సీన్ కి క్లాప్స్ పడ్డాయి. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాని ప్రేమతో చేశారు. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు థాంక్ యూ’ అన్నారు.

డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీడియా, ప్రేక్షలులు ఇచ్చిన అప్రిషియేషన్స్ నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చాయి. ఈ సినిమా, కార్తిపై మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్ యూ. ఆర్య, జడగం సినిమాలతో తెలుగులోనే కెరీర్ మొదలుపెట్టాను. తెలుగు నా సెకండ్ హోమ్. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

హీరోయిన్ శ్రీ దివ్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి మీడియా ఇన్ని మంచి ప్రసంశలు రావడం చాలా బావుంది. సినిమాని ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ. ఆడియన్స్ చూసి సక్సెస్ చేస్తేనే ఇలాంటి బ్యూటీఫుల్ ఫిలిమ్స్ ఇంకా వస్తాయి. కార్తి గారితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. మా డైరెక్టర్ గా ఐ ఫీస్ట్ లా సినిమా చేశారు. మా సినిమాకి వర్క్ చేసిన అందరికీ థాంక్ యూ. ఇంకా చూడని ఆడియన్స్ తప్పకుండా చూడండి. మంచి సినిమా సినిమా మిస్ అవ్వద్దు’ అన్నారు

రాకేందు మౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన మీడియా, ఆడియన్స్ కి థాంక్ యూ. ఈ సినిమా ఇచ్చిన కార్తి, సూర్య, జ్యోతిక గారికి థాంక్ యూ. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా అనిపించింది. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా చూపించాలని డైరెక్టర్ గారికి ఒక ఎడిట్ అడిగాను. దానిని అంగీకరీంచిన ఆయనకి థాంక్ యూ. చాలా మంచి సినిమా ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడాలి’ అన్నారు.

Latest News

రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ‘అభిమాని’ మూవీ గ్లింప్స్‌ విడుదల

సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. ఇప్పటికే దేవినేని సహా అనేక సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సురేష్ కొండేటి...

More News