మీ అందరికీ గొప్ప సినిమా ఇవ్వాలనే ‘కంగువ’ చేశా – సూర్య

స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు వైజాగ్ లో కంగువ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ – ‘కంగువ’ మెగా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సూర్య గారు మనల్నిేేే ఎన్నో ఏళ్లుగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఆయన పాటలు మనం పాడుకుంటున్నాం. ఆయన డైలాగ్స్ చెప్పుకుంటున్నాం. కంగువ సినిమాలో అలాంటి మాటలు పాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్క్రీన్స్ ఫైర్ అయ్యేంత పవర్ ఫుల్ గా కంగువ ఉంటుంది. మీరంతా థియేటర్స్ కు వెళ్లి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నటుడు అవినాష్ మాట్లాడుతూ – కంగువ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సూర్య గారితో వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేశాం. కంగువ చిత్రాన్ని డైరెక్టర్ శివ గారు అద్భుతంగా రూపొందించారు. జ్ఞానవేల్ రాజా గారు లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వల్లే కంగువ ఇంత గ్రాండ్ గా స్క్రీన్స్ మీదకు వస్తోంది. నవంబర్ 14న మీరంతా సినిమా చూడాలి. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – హీరో సూర్య గారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొనడం గర్వంగా అనిపిస్తోంది. ఆయన పక్కనే కూర్చునే అవకాశం దక్కింది. సూర్య గారి అభిమానిగా ఉండటం కష్టం. ఎందుకంటే ఆయనలా ఫిట్ నెస్ మెయింటేన్ చేయాలి. ఆయనలా డెడికేటెడ్ గా ఉండాలి. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. తెలుగు ఆడియెన్స్ కు ప్రాపర్ తమిళ చిత్రాన్ని పరిచయం చేసింది సూర్య గారే. డైరెక్టర్ శివ గారి గురించి తమిళంలోనే కాదు తెలుగులో చాలా పాజిటివ్ గా చెబుతారు. జ్ఞానవేల్ రాజా గారు నాకు మంచి ఫ్రెండ్. ఆయనకు కంగువ మరింత మంచి పేరు తీసుకురావాలి. అన్నారు.

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ – థ్యాంక్స్ టు వైజాగ్. వైజాగ్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మా సింగం 3 సినిమా ఇక్కడే షూటింగ్ చేశాం. మీరంతా ఎంతో ప్రేమ చూపించారు. తెలుగు ప్రేక్షకులు మాపై ఎంతో అభిమానం చూపిస్తారు. వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కంగువ లాంటి హ్యూజ్ ప్రెస్టీజియస్ మూవీ చేసేందుకు సగం కారణం మీ అభిమానం, మరో సగం కారణం మా గురువు లాంటి రాజమౌళి గారు ఇచ్చిన స్ఫూర్తి. నవంబర్ 14న కంగువ థియేటర్స్ లో చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ – తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. వాళ్లంతా సూర్య గారి గురించి గొప్పగా చెబుతుంటారు. ఒక హీరోగా, ఒక ఫాదర్ గా, ఒక బ్రదర్ గా ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు సూర్య. ఆయన కంగువ సినిమా కంటెంట్ కొంత మిత్రుడు జ్ఞానవేల్ గారు ఈ రోజు చూపించారు. ఆ సీన్స్ చూశాక కంగువ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. సూర్య గారికి మిగతా టీమ్ అందరికీ కంగువ సినిమా ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ శివ మాట్లాడుతూ – నేను జ్ఞానవేల్ రాజా గారికి మూడు కథలు చెప్పాను. ఆయనకు నచ్చాయి. మరో కథ ఉంది సార్ కానీ ఇది బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నాను. పర్లేదు చెప్పండి అన్నారు. అలా చెప్పిన కథే కంగువ. ఈ కథను సూర్య గారికి చెప్పండి అని జ్ఞానవేల్ గారు అన్నారు. సూర్య గారికి చెప్పగానే హగ్ చేసుకుని ఈ సినిమా మనం చేద్దాం శివ అన్నారు. అలా కంగువ మొదలైంది. ప్రతి దర్శకుడికి ఒక ఎపిక్ మూవీ చేయాలని ఉంటుంది. నాకూ అలాంటి అవకాశం కంగువతో దొరికింది. నాకు దేవిశ్రీ ప్రసాద్ లాంటి మంచి టీమ్ మెంబర్స్ దొరికారు. కంగువ ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా నవంబర్ 14న థియేటర్స్ కు వెళ్లమని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ – వైజాగ్ కంగువ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఘంటా శ్రీనివాసరావు గారు మాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఆయనకు మా కృతజ్ఞతలు చెబుతున్నాం. వైజాగ్ తో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా నాన్నగారి సినిమాల షూటింగ్ విశాఖలో జరిగినప్పుడు మేము వచ్చేవాళ్లం. అప్పటినుంచి వైజాగ్ తో అనుబంధం కొనసాగుతోంది. నేను కంగువ లాంటి బిగ్ మూవీ చేసేందుకు నా వైఫ్ జ్యోతిక సపోర్ట్ ఎంతో ఉంది. మా యూనిట్ లోని మూడు వేల మంది జీవిత భాగస్వాములు కూడా తమ కుటుంబాలను ఏ లోటు లేకుండా చూసుకోవడం వల్లే మేము రెండేళ్ల పాటు కంగువ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ చేయగలిగాం. అందుకు ఆ గొప్ప మహిళలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. నాకు తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, ప్రభాస్ లాంటి మంచి మిత్రులు దొరకడం సంతోషంగా ఉంది. కంగువ సినిమా డబ్బు కోసం చేసింది కాదు మీ అందరికీ ఒక గొప్ప సినిమా ఇవ్వాలని చేసిన ప్రయత్నం. థియేటర్ లో గొప్ప సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కంగువ ఉంటుంది. నవంబర్ 14న థియేటర్స్ లో కంగువ చూసి మా ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – నిశాద్ యూసుఫ్
సినిమాటోగ్రఫీ – వెట్రి పళనిస్వామి
యాక్షన్ – సుప్రీమ్ సుందర్
డైలాగ్స్ – మదన్ కార్కే
కథ – శివ, ఆది నారాయణ
పాటలు – వివేక్, మదన్ కార్కే
కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై
కాస్ట్యూమ్స్ – రాజన్
కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా
కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం – శివ

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

6 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

6 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago