Ramarao On Duty Teaser | Ravi Teja, Divyansha , Rajisha | Sarath Mandava | Sudhakar Cherukuri

Presenting you the Teaser of Ramarao on Duty Movie written and directed by Sarath Mandava. Produced by Sri Lakshmi Venkateswara Cinemas and RT Team Works, Starring Ravi Teja, Divyansha Kaushik and Rajisha Vijayan.

సెప్టెంబర్ 13న రాబోతోన్న ‘కళింగ’ హీరో, దర్శకుడు ధృవ వాయు

Must Read

కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు.. ఇప్పుడు కళింగ అంటూ కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు వస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీని సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నామంటూ ప్రకటిస్తూ ఓ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ‘టీజర్, పోస్టర్ వీటితోనే కళింగ మీద హైప్ పెరిగింది. ఆల్రెడీ అన్ని చోట్లా బిజినెస్ అయింది. కంటెంట్ అందరికీ నచ్చడంతో అన్ని చోట్లా డీల్స్ అయిపోయాయి. ఇది కచ్చితంగా రెగ్యులర్ మూవీలా మాత్రం ఉండదు. అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ఎమోషన్స్, లవ్, కామెడీ, హారర్, థ్రిల్లర్ ఇలా అన్నీ కావాలని పెట్టలేదు. స్క్రిప్ట్‌లో, కంటెంట్‌లో అవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చాయి. నేను ఎక్కువగా మాట్లాడే బదులు.. సినిమా మాట్లాడాలి. టీజర్, సాంగ్స్ చూడని వాళ్లంతా టీ-సిరీస్ యూట్యూబ్ చానెల్‌‌లో చూడండి. కంటెంట్, స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. ఇంత వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో అయితే రాలేదు. కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లో చూసి ఆదరించండి. మా సినిమా సెప్టెంబర్ 13న రాబోతోంది’ అని అన్నారు.

కెమెరామెన్ అక్షయ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమా కోసం టీం అంతా చాలా కష్టపడింది. చాలా వరకు ఫారెస్ట్ ఏరియాల్లోనే షూట్ చేశాం. వర్షం, ఎండ అంటూ ఇలా చాలా కష్టపడాల్సి వచ్చింది. సినిమా మాత్రం అద్భుతంగా వచ్చింది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదని మాత్రం గ్యారెంటీ ఇస్తాను’ అని అన్నారు.

నిర్మాత దీప్తి కొండవీటి మాట్లాడుతూ.. ‘కళింగ గురించి అక్షయ్ సగం చెప్పాడు.. వంశీ మిగతా సగం చెబుతాడు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. సినిమాను చూసిన తరువాత ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వెళ్తారు. కళింగ అనేది ధృవ వాయు ఐడియా. మేం ఆయనకు సపోర్ట్ చేశామంతే’ అని అన్నారు.

హీరోయిన్ ప్రజ్ఞా నయన్ మాట్లాడుతూ.. ‘కళింగలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. లవ్, రొమాన్స్, హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్నీ ఉంటాయి. ధృవ వాయు ఈ సినిమాను అద్భుతంగా తీశాడు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

నిర్మాత పృథ్వీయాదవ్ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమా అద్భుతంగా వచ్చింది. చాలా వరకు అవుట్ డోర్‌లో, ఫారెస్ట్‌లో తీశాం. ఈ చిత్రానికి మొదటి హీరో కెమెరామెన్ అక్షయ్. ఆయన ఈ మూవీని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. ధృవ వాయు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తీశారు. సెప్టెంబర్ 13న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ మాట్లాడుతూ.. ‘కళింగ సినిమా చాలా బాగా వచ్చింది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అన్ని రకాల ఎమోషన్స్‌, అంశాలు ఇందులో ఉంటాయి. సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. సెప్టెంబర్ 13న రాబోతోన్న కళింగను థియేటర్లో చూసి విజయవంతం చేయండి’ అని అన్నారు.

Kalinga Teaser | Dhruva Vaayu | Pragya Nayan | Deepthi Kondaveeti | Pruthivi Yadav | Big Hit Prod.

నటుడు బలగం సంజయ్ మాట్లాడుతూ.. ‘ధృవ వాయు నాకు మంచి స్నేహితుడు. సొంతంగా తనది తాను నిరూపించుకోవాలని చూస్తుంటాడు. ఈ చిత్రంలో విలన్ రోల్ బాగుంటుంది.. నువ్వు చెయ్ అని నాతో అన్నాడు. ఈ మూవీలో అన్ని రకాల అంశాలుంటాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

Latest News

విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ‘ప్రభాస్’ లుక్ విడుదల

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ...

More News