క సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” రోజు థియేటర్స్ లోకి వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. థ్రిల్లర్ సినిమాల్లో ఓ సరికొత్త ప్రయత్నంగా “క” సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు మూవీ టీమ్. ఈ సెలబ్రేషన్స్ లో హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్స్ నయన్ సారిక, తన్వీ రామ్, నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి, దర్శకులు సుజీత్, సందీప్, తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, ఇతర టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – “క” సినిమాకు ఘన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మా మూవీకి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మా మూవీకి ఎంతో సపోర్ట్ లభిస్తోంది. “క” సినిమా విజయంతో ఈ దీపావళిని మాకు ఎంతో స్పెషల్ గా చేశారు. మా మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసిన వంశీ గారికి థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్స్ సుజీత్, సందీప్ సాధించిన ఈ విజయానికి వాళ్ల పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నాను. ఇద్దరు హీరోయిన్స్ తన్వీ రామ్, నయన్ సారిక బాగా నటించారు. “క” సినిమా బిగినింగ్, ఎండింగ్ మిస్ కావొద్దు. సినిమా చివరలోనే కథలోని ఎస్సెన్స్ ఉంది. రోలింగ్ టైటిల్స్ వరకు సినిమా చూడండి. నేను మా టీమ్ మిమ్మల్ని పర్సనల్ గా వచ్చి కలుస్తాం. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – మీ అందరికీ హ్యాపీ దీవాళి. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎన్నో భావోద్వేగాలు కలుగుతున్నాయి. “క” సినిమాకు విజయాన్నిచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. కిరణ్ గారు చెప్పినట్లు బిగినింగ్, ఎండింగ్ మిస్ కాకండి, అలాగే ఇంటర్వెల్ తో మిస్ కావొద్దు. “క” సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. అన్నారు.

హీరోయిన్ తన్వీ రామ్ మాట్లాడుతూ – “క” సినిమాకు ప్రేక్షకులు ఇస్తున్న స్పందన నేను మా టీమ్ కళ్లారా చూశాం. ప్రీమియర్ షోస్ కు వెళ్లినప్పుడు థియేటర్ లో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద విజయాన్ని మా సినిమాకు ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నాం. కిరణ్ కు మీరు ఇస్తున్న సపోర్ట్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. అలాగే మా టీమ్ కు దక్కిన ఈ విజయానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సందర్భంలో ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది. అన్నారు.

దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ – “క” సినిమాను సక్సెస్ చేసిన ఆడియెన్స్ అందరికీ థ్యాంక్స్. మేము నమ్మిన కథ ప్రేక్షకుల ఆదరణ రూపంలో విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఒక కొత్త కంటెంట్ ను, కొత్త నేరేటివ్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నతీరు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రొడ్యూసర్ గోపి గారికి, వంశీ గారికి, కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. భవిష్యత్ లోనూ ఇలాంటి మంచి మూవీస్ చేస్తామని మాటిస్తున్నా. అన్నారు.

దర్శకుడు సందీప్ మాట్లాడుతూ – కంటెంట్ బాగున్న సినిమాలు వస్తే మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేందుకు “క” లేటెస్ట్ ఎగ్జాంపుల్ . కొత్తగా సినిమాను చేస్తే మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు. ముందు ఇలాంటి కొత్త కథను యాక్సెప్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ రోజు మా సినిమాను ప్రేక్షకులు ఎంతగా రిసీవ్ చేసుకున్నారంటే ఎవరైనా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడితే వారికి ప్రేక్షకులే సమాధానం ఇస్తున్నారు. ప్రేక్షకులు మెచ్చుకునే ఇంకా మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు చేయాలనుకుంటున్నాం. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – “క” సినిమాకు అన్ని ఏరియాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని సెంటర్స్ లో 80 పర్సెంట్ ఫుల్స్ అవుతున్నాయి. ఫస్ట్ షో, సెకండ్ షో హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. నైజాంతో పాటు ఆంధ్రా, సీడెడ్ అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. 18 ప్రీమియర్స్ తో మేము స్టార్ట్ చేస్తే అది 71 షోస్ కు వెళ్లింది. ఈ 71 షోస్ లో 56 షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. 8 క్లాక్ షో కు 7 గంటలకు బుకింగ్స్ ఓపెన్ చేసినా టికెట్స్ క్లోజ్ అయ్యాయి. మా డిస్ట్రిబ్యూటర్స్ కూడా “క” సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో ఇప్పడే చెప్పలేం అంటున్నారు. అలా నెంబర్స్ వస్తున్నాయి. కనీసం 3 వారాలు బాక్సాఫీస్ దగ్గర “క” సినిమాకు ఢోకా లేదని చెబుతున్నారు. నా కెరీర్ లోనే ఇలాంటి ది బెస్ట్ ఫిలిం ఇచ్చిన ప్రొడ్యూసర్ గోపి గారికి, హీరో కిరణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. టికెట్స్ కోసం నాకు ఎన్నో ఫోన్స్ వస్తున్నాయి. టికెట్స్ ఇవ్వలేనంతగా హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అంత బ్లాక్ బస్టర్ సినిమా చేశాం. సినిమాకు పడిన కష్టం ఈ ఘన విజయంతో మర్చిపోతున్నాం. మా సంస్థకు ఇంతమంచి విజయాన్ని ఇచ్చిన హీరో కిరణ్ గారికి, డైరెక్టర్స్ సుజీత్, సందీప్, డిస్ట్రిబ్యూటర్ వంశీ, ఇతర టీమ్ మెంబర్స్ కు థ్యాంక్స్. అన్నారు.

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago