FNCC అధ్యక్షులు కె. ఎస్. రామారావు కు ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది.

ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ కు ఆద్యుడు ఎన్. టి. ఆర్. -కె. ఎస్. రామారావు.
ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ ఇవ్వాళ దేశంలోనే ఇంత ప్రతిష్టాత్మకంగా ఉన్నదంటే అందుకు ఆద్యులు నందమూరి తారక రామారావు గారేనని అధ్యక్షులు కె. ఎస్. రామారావు తెలిపారు. 2024 – 25 సంవత్సరాలకు ఎఫ్. ఎన్. సి. సి అధ్యక్షులుగా ఎన్నికైన కె. ఎస్. రామారావు ను ఎన్. టి. ఆర్. శత జయంతి కమిటీ సత్కరించింది.


ఈ సందర్భంగా కె. ఎస్. రామారావు మాట్లాడుతూ.. 1995లో ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డి. వి. ఎస్. రాజు గారి ద్వారా మద్రాస్ లో స్థిరపడిన మా అందరినీ ఆహ్వానించారు. మద్రాసు నుంచి మా అందరినీ హైదరాబాద్ కు తరలి రమ్మన్నారు. అప్పుడు ఫిలిమ్ నగర్ లో మా అందరికీ ఓకే సమావేశమందిరం కావాలని అడిగాము, వారు వెంటనే ఫిలిమ్ నగర్ లో స్థలం చూసుకోమ్మన్నారు. మేము ఇప్పుడున్న కొండను ఎంపిక చేసుకొని చెప్పాము, వారు వెంటనే అధికారులను పిలిపించి ఫైల్ సిద్ధం చెయ్యమన్నారు. అయితే ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో చంద్ర బాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. రామారావు గారు స్థలం ఇస్తామని చెప్పిన సంగతి బాబు గారితో చెప్పగానే మరో మాట లేకుండా ఈ స్తలాన్ని కల్చరల్ సెంటర్ కు కేటాయించారు. చంద్ర బాబు గారే శంకుస్థాపన చేసి ప్రారంభించారని కె. ఎస్. రామారావు తెలిపారు.


ఎన్. టి. ఆర్.సెంటినరీ కమిటీ చైర్మన్ టి. డి. జనార్దన్ మాట్లాడుతూ.. తెలుగు సినిమా రంగంలో కె. ఎస్. రామారావు గారంటే ఒక బ్రాండ్, ఆయన హయాంలో ఫిలిమ్ నగర్ కల్చరల్ సెంటర్ బహుముఖాలుగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నా అన్నారు.
ఎన్. టి. రామారావు గారు హీరోగా నటించిన ‘విచిత్ర కుటుంబం’ సినిమా ద్వారా 1969లో అసిస్టెంట్ దర్శకుడుగా కె. ఎస్. రామారావు సినిమా రంగంలోకి ప్రవేశించారని భగీరథ తెలిపారు.


ఈ సమావేశంలో ఎన్. టి. ఆర్. కమిటీ సభ్యులు, రవి శంకర్, మధుసూదన రాజు, రాంబాబు పర్వతనేని, శ్రీపతి సతీష్ పాల్గొన్నారు.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

1 week ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago