“కిల్లర్” మూవీ నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంఛ్

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. పూర్వాజ్ “కిల్లర్” చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

“కిల్లర్” మూవీ మోషన్ పోస్టర్ ఎలా ఉందో చూస్తే – చేతిలో గొడ్డలి పట్టుకున్న పవర్ ఫుల్ వుమెన్ రోబోను పరిచయం చేశారు. ఆ రోబో జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ గా మారడం ఆసక్తికరంగా ఉంది. జ్యోతి పూర్వజ్ క్యారెక్టర్ లుక్ లో ఆమె ఒక భుజానికి వెజిటేబుల్స్ బ్యాగ్, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉంది. అద్దంలో ఆమె రిఫ్లెక్షన్ పవర్ ఫుల్ వుమెన్ రోబోను చూపిస్తోంది. మోషన్ పోస్టర్ లో చూపించిన ఎలిమెంట్స్ అన్నీ “కిల్లర్” మూవీపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం
వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.
నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.
రచన దర్శకత్వం – పూర్వాజ్

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

14 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

14 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

14 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago