జాన్ అబ్రహం …‘పఠాన్’లో ప్రతి నాయకుడి పాత్ర

షారూక్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘పఠాన్’. రీసెంట్‌గా ఆ సినిమా టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. టీజ‌ర్‌లో గ‌మ‌నిస్తే ప‌ఠాన్ చిత్రంలో జాన్ అబ్ర‌హం షారూక్ ఖాన్ బ‌ద్ద శ‌త్రువు పాత్ర‌లో న‌టించారు. త‌న లుక్ కూడా కూల్‌గా క‌నిపిస్తుంది. అయితే అత‌ను త‌న శ‌త్రువు పూర్తి నాశ‌నం చేయాల‌నుకునే సైనికుడు. ‘ఎలాన్‌తో క‌లిసి జాన్ మాత్రమే అలాంటి పాత్ర‌లో న‌టించ‌గ‌ల‌ని భావించాం. నిజంగానే ఆయ‌న త‌న న‌ట‌న‌తో మ‌మ్మ‌ల్ని థ్రిల్ చేశారు’ అని అన్నారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘‘ప‌ఠాన్‌’ చిత్రం లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీ. అలాంటి సినిమాలో ధీటైన విల‌న్ ఉండాల‌ని మేం భావించాం. స్క్రీన్‌పై అత‌ని ప్రెజ‌న్స్ ఓ క‌రెంట్‌లాగా ఉండాల‌ని, క్రూర‌త్వంతో కూడినట్టు ఉండాల‌ని మేం ఆశించాం.

అందుక‌నే జాన్ అబ్ర‌హంను దృష్టిలో పెట్టుకునే ఆ పాత్ర‌ను రాసుకున్నాను’’ అన్నారు.త‌ను ఇంకా మాట్లాడుతూ ‘‘జాన్ ఈ సినిమాకు మా మొదటి ప్రాధాన్యతే కాదు.. అతను మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని, అతన్నే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే సినిమాలో ఓ పవర్ ఫుల్ ప్రతి నాయకుడి ఉన్నప్పుడు ప్రేక్షకులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. అందుకు తగ్గట్టే టీజర్లో ప్రతి సన్నివేశానికి ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. షారూక్ ఖాన్‌కి పాత్ర‌ను ఢీ కొట్టే న‌ర రూప రాక్ష‌సుడిలాంటి పాత్ర‌కు జాన్ త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోశాడు. షారూక్‌, జాన్ అబ్ర‌హం మ‌ధ్య స‌న్నివేశాలు సీట్ ఎడ్జ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తాయి’’ అన్నారు.‘పఠాన్’ చిత్రం జనవరి 25 2023న హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

11 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

12 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

12 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago