‘జిగ్రీస్’ థియేటర్స్ లో కల్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది: ప్రెస్ మీట్ లో జిగ్రీస్ టీం

కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ “జిగ్రీస్”. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జిగ్రీస్ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. జిగ్రీస్ 14న రిలీజ్ అవుతుంది. ఇది యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఒక కొత్త ఫీల్ ఇవ్వడం కోసం చాలా కేర్ తీసుకున్నాం. ఈ నలుగురిని చూస్తే మీలో ఒకరిగానే అనిపిస్తారు. కచ్చితంగా అన్ని క్యారెక్టర్స్ తో రిలేట్ అవుతారు. ప్రతి సిన్ని హిలేరియస్ గా నవ్వుకుంటారు. ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. మా యాక్టర్స్ అందరూ అమేజింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. చాలా నేచురల్ గా చేశారు. అన్నీ అందుతమైన నేచురల్ లోకేషన్స్ లో చేసిన సినిమా ఇది. మీ ఫ్యామిలీ, జిగ్రీస్ తో వెళ్ళండి. సినిమాకి ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు.  

మణి వక్కా మాట్లాడుతూ.. అందరికీ థాంక్యూ. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. రెండున్నర గంటలకు సినిమాలో చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి సీన్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాల లొకేషన్స్ మీ అందరికీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. నవంబర్ 14న అందరం థియేటర్స్ లో కలుద్దాం.

కృష్ణ బురుగుల మాట్లాడుతూ… అందరికి నమస్కారం. టీజర్ ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నవంబర్ 14న అందరం థియేటర్స్ లో కలుద్దాం.  

ధీరజ్ ఆత్రేయ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఈ సినిమా  ఒక మంచి ఎక్స్పీరియన్స్. అందరు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. చాలా అద్భుతమైన లొకేషన్స్ లో ఈ సినిమాని షూట్  చేశాం, అన్ని రియల్ లొకేషన్స్. మా డైరెక్టర్ గారు చాలా కష్టపడ్డారు. మీరు ఇప్పటివరకు చూడడానికి గోవా లొకేషన్స్ ని చూస్తారు, నవంబర్ 14న అందరూ థియేటర్స్ లో కలుద్దాం.

నిర్మాత కృష్ణ వోడపల్లి మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ఈ సినిమాని చాలా కష్టపడి తీశాం. మా టీంకి  థాంక్యూ. లొకేషన్స్ సీన్స్ అన్నీ  ఒక కల్ట్ సినిమా గా ఉండబోతుంది. సినిమా ఎంత హిలేరీష్ గా ఉంటుందో అంత ఎమోషనల్ గా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమాని అందరూ నవంబర్ 14న థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

సహ నిర్మాత చిట్టెం వినయ్  మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇది మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. తప్పకుండా మీ అందరిని అలరిస్తుంది. నవంబర్ 14న అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

నటీనటులు: కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: హరిష్ రెడ్డి ఉప్పుల
నిర్మాత: కృష్ణ వోడపల్లి
డీవోపీ: ఈశ్వరాదిత్య
ఎడిటర్: చాణక్య రెడ్డి
సంగీతం: కమ్రాన్
సౌండ్ డిజైన్: వి. స్వాప్నిక్ రావు
పీఆర్వో: వంశీ-శేఖర్

TFJA

Recent Posts

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

3 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

3 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

6 days ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 week ago

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌ రఘు కుంచె టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం "గేదెల రాజు". ఈ సినిమాలో రవి…

1 week ago

ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సాన చేతుల మీదుగా ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ “పోచమ్మ” గ్లింప్స్ రిలీజ్

లీడింగ్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా మరో సరికొత్త వెబ్ సిరీస్ "పోచమ్మ" ను సబ్ స్క్రైబర్స్ ముందుకు…

1 week ago