టాలీవుడ్

‘జిగ్రీస్’ పిచ్చి పాషన్ తో చేసిన సినిమా-సందీప్ రెడ్డి వంగా

‘జిగ్రీస్’ పిచ్చి పాషన్ తో చేసిన సినిమా. మ్యూజిక్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ “జిగ్రీస్”. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జిగ్రీస్ నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ఇలాంటి సినిమా చేయడానికి యూనిట్ అందరికీ ఒక పిచ్చి కావాలి. సినిమా మ్యూజిక్ చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమా కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. సెన్సార్, ప్రివ్యూ రిపోర్ట్స్ జనరల్  చాలా జెన్యూన్ గా అనిపించింది. అది థియేటర్స్ లో కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా పిచ్చితో కష్టపడి తీశారు. అర్జున్ రెడ్డి నేను ఎలా తీశాను అంతకంటే ఎక్స్ట్రీమ్ గా తీశారు.  దానికోసం అయినా సినిమా బాగా ఆడాలి. హీరో డైరెక్టర్ తో సంబంధం లేకపోయినా ఏదో ఒక ఎలిమెంట్ నచ్చితే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూస్తారు. అది మన తెలుగు ఆడియన్స్ స్పెషాలిటీ. ఈ సినిమా కూడా థియేటర్స్లోకి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను.  టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమాకి సక్సెస్ మీట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అందరికి గుడ్ లక్.

కృష్ణ బురుగుల మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మీడియా ఇచ్చిన సపోర్ట్ కి స్పెషల్ థాంక్స్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిన్న ప్రీమియర్ వేసాం.  చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో మాకు మరింత నమ్మకం వచ్చింది. ఒక నటుడిగా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే జనాలకి నచ్చే సినిమా చేసినప్పుడే గుర్తింపు వస్తుందని తెలుసుకున్నాను. గత మూడేళ్లుగా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ఈ సినిమా నాకు ఒక డీజే టిల్లు, జాతి రత్నాలు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెబుతుంది కాదు నమ్మకంతో చెబుతున్నాను. 100% మిమ్మల్ని నవ్విస్తాను. నవ్వించకపోతే ఇంకెప్పుడు యాక్టింగ్ చేయను. ప్రొడ్యూసర్ కృష్ణ అన్న ఎంతో సపోర్ట్ చేశారు చాలా డౌటు ఎర్త్ పర్శన్.  నాకు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. డైరెక్టర్ గారి వర్క్ సినిమాలో చూస్తారు. మూడేళ్లుగా ఈ సినిమా పైనే ఉన్నారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.  సందీప్ అన్న సపోర్ట్ ని మర్చిపోలేను. ఆయన గర్వపడే సినిమాలు చేస్తాను. అందరం థియేటర్స్ లో కలుద్దాం.  

యాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సందీప్ అన్నకి థాంక్యూ. జిగ్రీస్ నాకు చాలా స్పెషల్ ఫిలిం ఇది రిపీట్ వాల్యూ ఉండే సినిమా. నవంబర్ 14న అందరూ థియేటర్స్ లో చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

యాక్టర్ మణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమాకి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సందీప్ అన్నకి థాంక్యూ. మా డైరెక్టర్ చాలా ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. మా నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా సపోర్ట్ చేశారు. కృష్ణ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. ధీరజ్ చాలా టాలెంటెడ్ .తను డైరెక్టర్ కూడా అవుతాడు. మా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యు. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు

డైరెక్టర్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. జిగ్రీస్ రేపు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత కృష్ణకి మీరందరూ ఫ్యాన్ అయిపోతారు. ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తారు. నిన్న ప్రీమియర్స్ వేసాం థియేటర్స్ ఊగిపోతున్నాయి. ధీరజ్ ఆత్రేయ డైలాగులు లేకుండానే అదరగొట్టాడు. మణి సింగిల్ టేక్ పెర్ఫార్మర్ తను కూడా చాలా పెద్ద స్టార్ అవుతాడు. నిర్మాత కృష్ణ గారు చాలా ప్యాషన్ తో సినిమా చేశారు. ఈశ్వర్  అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలని తీసాము. థియేటర్స్ లో మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది. సందీప్ అన్న లేకపోతే మా సినిమాకి ఇంత ఎక్స్పోజర్ ఉండేది కాదు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఆయనే. ఇంత బిజీలో కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అందరం నవంబర్ 14న థియేటర్స్ లో కలుద్దాం

ప్రొడ్యూసర్ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మా సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాని మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. కర్ణాటక మహారాష్ట్ర గోవా బెంగళూరు కేరళ ఇలా అద్భుతమైన లొకేషన్స్ లో తీసిన సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో మిస్ అవ్వకుండా చూడండి.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

45 minutes ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago