“ఝాన్సీ” సీజన్ 2 ట్రైలర్, ఈ నెల 19న డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

Must Read

స్టార్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘ఝాన్సీ’. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సీజన్ 1 ఇప్పటికే రిలీజై మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. దర్శకుడు తిరు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. ట్రైబల్ హార్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మించారు.

Jhansi Season 2 Trailer | Streaming From 19 Jan | Anjali | Chandini Chowdary | Disney+Hotstar Telugu

‘ఝాన్సీ’ సీజన్ 2 జనవరి 19న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. సైకలాజికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఝాన్సీ వెబ్ సిరీస్ సీజన్ 2 ట్రైలర్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లతో ఆకట్టుకుంది. యాక్షన్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో అంజలి తన పర్మార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది. ఇందులో అబ్ రామ్, ఆదర్శ్ బాలకృష్ణ, సంయుక్త హార్నాడ్, చాందినీ చౌదరి, శరణ్య, రాజ్ అర్జున్, కళ్యాణ్ మాస్టర్, ముమైత్ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News