నవంబర్ 8 న విడుదల కానున్న ‘జ్యువెల్ థీఫ్’ చిత్రం

సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. Beware of Burglar అనేది స‌బ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్, థాయిలాండ్ లో పాటలను గ్రాండ్ గా చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ కు అనూహ్య స్పందన వచ్చింది. హీరో కృష్ణ సాయి డాన్స్ , మేనరిజమ్స్ , హెయిర్ స్టైల్ సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేస్తుండటం విశేషం. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సినిమాను నవంబర్ 8న విడుద‌ల‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టీన‌టులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు.

హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని..ఆయన ఇన్సిపిరేషన్ తో చిత్ర సీమలోకి అడుగుపెట్టాను. ‘ జ్యువెల థీప్ ‘ అనే మంచి కథ లో ప్రేక్షకుల ముందుకొస్తున్నామని అన్నారు… ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ , టీజర్ మరియు ట్రైలర్ , సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది.. మరో వైపు సెన్సార్ బోర్డు ప్ర‌శంస‌లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. నవంబర్ 8 న విడుదల కాబోతున్న మా సినిమా ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్రేమ గారితో క‌లిసి ఈ సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది.” అన్నారు.

నటీనటులు:
హీరో కృష్ణసాయి, హీరోయిన్ మీనాక్షి జైస్వాల్, ప్రేమ, అజయ్, స‌మ్మెట గాంధీ, సీనియర్ కన్నడ హీరోలు శ్రీధర్, వినోద్ కుమార్, నటీమణులు రాగిణి, హీరోయిన్ నేహా దేశపాండే, ఆనంద చక్రపాణి, జెన్నీ, మేక రామ కృష్ణ, వైజాగ్ జగదీశ్వరి, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, అప్పాజి, కాట్రగడ్డ సుధాకర్, జంగారెడ్డి, వెంకట రమణారెడ్డి, శ్రావణి, శ్వేత రెడ్డి తదితరులు.

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం:
పీఎస్ నారాయణ

డీవోపీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్ : జేపీ
ఫైట్ మాస్టర్: రమణ
డాన్స్: స్వర్ణ, యాని
లిరిక్ : కామేశ్వర్, పీఎస్ నారాయణ
మ్యూజిక్: ఎంఎం శ్రీలేఖ,
ఆడియో: ఆదిత్య మ్యూజిక్
ఆర్ట్ డైరెక్టర్ కె.మురళీధర్,
పీఆర్వో: కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

TFJA

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

5 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

6 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

6 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

6 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

6 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago