నవ దళపతి సుధీర్ బాబు పాన్- ఇండియా సినిమాటిక్ యూనివర్స్ లో తన కెరీర్‌ను న్యూ హైట్స్ కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో శివన్ నారంగ్‌తో పాటు ప్రముఖ నిర్మాత ప్రేరణా అరోరా నిర్మిస్తున్న ఈ మూవీతో సూపర్ నేచురల్ ఫాంటసీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీకి ‘జటాధర’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.
జటాధర ఇప్పటికే తెలుగు, బాలీవుడ్ రెండింటిలోనూ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసిన ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ సుధీర్ బాబుని పవర్ ఫుల్, స్ట్రాంగ్ అవతార్ లో ప్రెజెంట్ చేసింది. సుధీర్ బాబు తన చేతిలో త్రిశూలంతో శివుని రూపం ముందు నిలబడి ఉన్నారు. సిక్స్-ప్యాక్ అబ్స్ తో మాచోలా కనిపిస్తున్నారు.
రుస్తోమ్, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ , పరి లాంటి సూపర్ హిట్స్ అందించిన విజనరీ ప్రొడ్యూసర్ ‘ప్రేర్ణ అరోరా’ నిర్మాణ భాగస్వామిగా వున్న ఈ ఎక్సయిటింగ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.
గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేయనున్నారు. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
జటాధర 2025 మహాశివరాత్రికి గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…