పరిచయం:
2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించినది. దీనితోబాటు సామాజిక స్పృహ, సంప్రదాయాలు ఇంకా ఆరోగ్యకరమైన పోటీ భావనను పెంచడమే లక్ష్యంగా ఈ క్రీడా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
ఈశా గ్రామోత్సవం ప్రాముఖ్యత:
ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో, పట్టణీకరణ వల్ల తరచూ మరుగున పడుతున్న గ్రామీణ జీవన విధానాన్ని, అక్కడి ప్రత్యేక సాంప్రదాయాలకూ ఈశా గ్రామోత్సవం ఎంతో ప్రాముఖ్యతనిస్తోంది. గ్రామీణ ఆటలు, కళ, నృత్యం, నాటకం, సంగీతం వంటి విలక్షణమైన స్థానిక గ్రామీణ భారతదేశ సంస్కృతులను ప్రదర్శించడానికి దీనిని రూపొందించారు.
విభాగాలు:
పురుషులకు వాలీబాల్
మహిళలకు త్రోబాల్
గ్రామీణ ఆటలు
సాంప్రదాయ కళలు
2004 నుండి ఇప్పటి వరకు:
ఈశా గ్రామోత్సవంలో ఇప్పటివరకు 8,412 జట్లు, 1,00,167 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగే ఈ గ్రామోత్సవం గ్రాండ్ ఫినాలేలో ప్రధాన అంశం ఈశా పునరుజ్జీవన షీల్డ్ – పురుషుల వాలీబాల్, మహిళల త్రోబాల్.
ఈ సంవత్సరం ప్రణాళికలు:
మొట్టమొదటి సారి, ఈశా గ్రామోత్సవం దక్షిణ భారతదేశం అంతటా నిర్వహిస్తున్నాము. ఈ క్రింది రాష్ట్రాల నుండి 80,000 మందికి పైగా క్రీడాకారులు ఇందులో పోటీ పడనున్నారు.
● ఆంధ్రప్రదేశ్
● తెలంగాణ
● తమిళనాడు
● కేరళ
● కర్ణాటక
● పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)
తెలంగాణాలో 13 జిల్లాలలో ఈ పోటిలు నిర్వహిస్తున్నారు:
కరీంనగర్
సిరిసిల్ల
యాదాద్రి
మెదక్
మహబూబ్ నగర్
సంగారెడ్డి
రంగారెడ్డి
నల్గొండ
నిజామాబాద్
జనగాం
వరంగల్
సిద్దిపేట
ఖమ్మం
ఆంధ్ర ప్రదేశ్ లో 13 జిల్లాలలో ఈ పోటిలు నిర్వహిస్తున్నారు:
విశాఖపట్నం
కాకినాడ
రాజమహేంద్రవరం
భీమవరం
గుంటూరు
నెల్లూరు
తిరుపతి
చిత్తూరు
ఏలూరు
కృష్ణా
అనంతపురం
వైఎస్ఆర్ కడప
ప్రకాశం
నవంబర్ 16 నుండి డిసెంబర్ 28 వరకు క్లస్టర్(జిల్లా స్థాయి), డివిజనల్(రాష్ట్ర స్థాయి) & ఫైనల్(దక్షిణ భారత దేశ రాష్ట్రాల పోటీ) – 3 దశల్లో మ్యాచ్‌లు నిర్వహించబడతాయి. ప్రతీ స్థాయిలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జెట్లకు మెరిట్ సర్టిఫికెట్ మరియు నగదు బహుమానం ఉంటుంది.
సద్గురు ఇంకా వేలాది మంది సమక్షంలో ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది డిసెంబర్ 28న ఈశా యోగా సెంటర్, కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద జరగనుంది.
విజేత జట్లకు ఈశా రిజువినేషన్ ట్రోఫీ ఇంకా నగదు బహుమతులు – వాలీబాల్ (పురుషులు): రూ. 5 లక్షలు, త్రోబాల్ (మహిళలు): రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులను అందజేస్తున్నాము.
గ్రామీణ భారత స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడమే గ్రామోత్సవం ప్రధాన లక్ష్యం. అందుకు క్రీడలను మాధ్యమంగా ఎంచుకున్నాము. జట్టులోని ఆటగాళ్లందరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడం గ్రామోత్సవానికి ఉన్న ప్రత్యేకత. ఈ టోర్నమెంట్ ప్రొఫెషనల్ ఆటగాళ్ల కోసం కాదు, ప్రతి ఒక్కరినీ ఆటలలో ప్రోత్సహించే వేదిక ఇది.
గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని చాటే ఈ వినూత్నమైన క్రీడా కార్యక్రమం కోసం మనమందరం కలిసి వద్దాం.
గుర్తింపులు:
ఈశా ఔట్రీచ్ ఇప్పటివరకు వివిధ గుర్తింపులను అందుకుంది
బియాండ్ స్పోర్ట్ అవార్డ్ : స్పోర్ట్ ఫర్ ఎన్విరాన్మెంట్ కేటగిరి 2010.
అలాగే 2010లో కామన్వెల్త్ గేమ్స్ కాఫీ టేబుల్ బుక్‌లో ఈశా గ్రామోత్సవం గురించి ప్రస్తావించారు.
2016-2017లో ఈశా యునిసెఫ్‌తో “డెమోన్‌స్ట్రేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఫర్ డెవలప్‌మెంట్” అనే ప్రాజెక్ట్‌ను విజయవంతంగా అమలు చేసింది
2018 వ సంవత్సరంలో, ఈశా ఔట్‌రీచ్ గౌరవనీయులైన భారత రాష్ట్రపతి నుండి క్రీడాభివృద్ధికి గాను “రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్” అవార్డును అందుకుంది.
Q: How do you manage so many projects and handle them efficiently? At one time,…
Isha Gramotsavam , launched by Sadhguru in 2004, holds immense significance in today's fast-paced world,…
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని…
Produced by K.S. Ramakrishna under the banner of RK International, the sci-fi adventure thriller Kaliyugam…
ఘనంగా 'NBK109' టీజర్ విడుదల కార్యక్రమం చిత్రానికి 'డాకు మహారాజ్' టైటిల్ సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న సినిమా…
God of Masses Nandamuri Balakrishna is entertaining audiences, fans and movie-lovers for past five decades…