హైదరాబాద్‌ NMDC మారథాన్‌లో ఈశా బ్రహ్మచారులు ఇంకా వాలంటీర్లు ఈశా విద్యకు మద్దతుగా పరిగెత్తారు

Must Read

ఈశా విద్య పై అవగాహన ఇంకా నిధులను సేకరించే ప్రయత్నంలో, 31 ఈశా బ్రహ్మచారులతో పాటు 170 కి పైగా మద్దతుదారులు ఆగస్టు 25న హైదరాబాద్‌లో జరిగిన NMDC మారథాన్‌లో పాల్గొన్నారు. వారు 42 కిమీ పూర్తి మారథాన్ ఇంకా 21 కిమీ హాఫ్ మారథాన్‌లో, 10K రన్ లలో పాల్గొన్నారు.

సద్గురు స్థాపించిన ఈశా ఫౌండేషన్ వారు సామాజిక అభివృద్ది కోసం ఈశా ఔట్రీచ్ అనే విభాగం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ఇంకా తమిళ నాడులో 10 ఈశా విద్య పాఠశాలలను ఏర్పరిచి, ఉన్నత విలువలతో ఇంగ్లీష్ మీడియం విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

ముఖ్యంగా గ్రామీణ పేద పిల్లలకు అందుబాటులో ఉండేలా విద్యను అందజేస్తున్నాయి. 2006లో ప్రారంభమైనప్పటి నుండి 10,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈశా విద్య పాఠశాలల్లో చదువుకున్నారు. వీరిలో 60% కంటే ఎక్కువ మంది విద్యార్థులు` వారి కుటుంబంలో బడికి వెళ్తున్న మొదటి తరం వారు – స్కాలర్‌షిప్‌ల ద్వారా మద్దతు పొందుతున్నారు. మిగిలిన వారు తక్కువ ఫీసులు చెల్లిస్తారు.

పాఠశాలలలో మౌళిక వసతులతో విశాలంగా, బాగా వెలుతురు ఉన్న తరగతి గదులు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉంటాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం వారికి అవసరమైన విటమిన్లు సమృద్ధిగా ఉండేలా పోషకాహార సమతుల్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. అంతే కాదు విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంటారు. పిల్లలు క్రీడలలో ఇంకా రోజువారీ యోగా అభ్యాసాలలో చురుకుగా పాల్గొంటారు. బహుళ స్థాయిలలో అభ్యాసాన్ని ఉత్తేజపరిచేందుకు ఇంటరాక్టివ్, చర్చ-ఆధారిత తరగతులు ఇంకా ఆచరణాత్మక అభ్యాసంతో ప్రత్యేకమైన పద్దతిని ఈ పాఠశాలలు అనుసరిస్తాయి. ప్రింట్, ఆడియో, వీడియో, కంప్యూటర్ మెటీరియల్స్ ఇంకా డిజిటల్ క్లాస్‌రూమ్‌ల రూపంలో 21వ శతాబ్దంలో విద్యార్థులకు అవసరమైన ప్రాపంచిక అవగాహనను కల్పిస్తూ, వారి నైపుణ్యాలను పెంపొందించేలా ఈశా విద్య పాఠశాలలు కృషి చేస్తున్నాయి.

ఈ చిన్నారులు చదువుకునేలా మనందరం సహకారం అందించి వాళ్ళకి మనం అండగా ఉన్నామనే నమ్మకాన్ని ఇవ్వగలం.

ప్రణామం

Latest News

Actor Yogesh Kalle in the Pan India Film Trimukha

Actor Yogesh kalle is making his acting debut with the Pan Indian Film "Trimukha" in which nassar, CID Aditya...

More News