‘ఇరుముడి’ కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుంది. ‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ ఇరుముడి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఇరుముడి సినిమాకి మ్యూజిక్ చేయడం మీకు ఎంత ప్రత్యేకంగా అనిపించింది?
-నేను ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు చాలా చేశాను. ఇరుముడి మాత్రం చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. దర్శకుడు శివ నిర్వాణ గారు కథ చెప్పినప్పుడే నేను అందులో లీనమైపోయాను. తెలుగు సినిమాకి ‘ఇరుముడి’ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో వచ్చే మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. ఈ సినిమాకి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది చాలా మంచి సినిమా అవుతుంది.

ఈ సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మేము మా బెస్ట్ ఇచ్చాము. ఈ సినిమాకి బెస్ట్ రీజినల్ ఫిలిం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. అలాగే కమర్షియల్‌గా కూడా సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను.

ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఎలాంటి అప్రోచ్ తీసుకున్నారు?
-ఈ సినిమా మ్యూజిక్ నాకు చాలా స్పెషల్. ఇందులో ప్రతిదీ సైకలాజికల్‌గా ఉంటుంది. మనం ఒకటి ఊహిస్తాము కానీ వేరే మలుపు వస్తుంది. అలాగే పాత్రలు మారే విధానం, సంఘటనలు, సన్నివేశాలు ఇవన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఇంటెన్స్ సైకలాజికల్ థింకింగ్‌తో అప్రోచ్ అయ్యాను. ‘ఓంకార’ అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమా మ్యూజిక్‌కి చాలా సైకలాజికల్ అప్రోచ్ ఉంటుంది. నేను ‘ఇరుముడి’ స్కోర్‌ని కూడా అలాగే ట్రీట్ చేశాను.

రవితేజ గారి నుంచి మీరు అందుకున్న అప్రిషియేషన్ ఏంటి?
-పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ విషయంలో రవితేజ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. క్లైమాక్స్‌లో చేసిన పాట ఆయనకి చాలా నచ్చింది. అది ఇంకా రిలీజ్ చేయలేదు. థియేటర్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌కి చాలా కీలకంగా ఉంటుంది. ఆ పాట రవితేజ గారికి చాలా ఇష్టం.

‘మల్లెపూల పల్లకి’ పాటను మళ్లీ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నారు?
-అది చాలా అద్భుతమైన భక్తి పాట. ఆ పాటకి చాలామంది అభిమానులు ఉన్నారు. అభిమానులందరినీ మేము దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సినిమా డివోషన్ చాలా ప్యూర్‌గా ఉంటుంది. అందుకే ఇందులో ప్రతి పాటని చాలా రియల్‌గా చేశాం.

-గత నాలుగు రోజుల నుంచి ‘మల్లెపూల పల్లకి’ పాట ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి.

-‘మల్లెపూల పల్లకి’ ఒక ఐకానిక్ సాంగ్. అందుకే ఆ పాటను ఒరిజినల్ సింగర్‌తోనే పాడించాం. ఈ పాట వాళ్లు పాడితే బాగుంటుంది, ఒక సెలబ్రేషన్‌లా ఉంటుందని ఆ బృందంతోనే, ఒరిజినల్‌గా పాడిన బృందంతోనే పాడించాం.

మీరు మ్యూజిక్ చేయాలంటే కథ మొత్తం వింటారా?
-నాకు కథ చాలా ముఖ్యం. కథ మొత్తం నేను వింటాను. అది విన్న తర్వాత ఆ సినిమాకి, ఆ కథకి ఎలాంటి సంగీత ప్రపంచాన్ని సృష్టించాలనేది ఆలోచిస్తాను. అందుకే కథ విషయంలో నేను చాలా పర్టికులర్‌గా ఉంటాను. పూర్తి కథని క్షుణ్ణంగా వింటాను.

ఈ సినిమాలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సీక్వెన్సులు ఏమిటి?
-చాలా ఛాలెంజింగ్ సీక్వెన్సులు ఉన్నాయి. ఈ సినిమా మొత్తానికి నేను ఒక సైకలాజికల్ మ్యూజిక్ చేశాను. రెండు మూడు లేయర్స్‌లోనే మ్యాజిక్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాను. మూడు లేయరులో ఇంపాక్ట్‌ఫుల్ మ్యూజిక్ క్రియేట్ చేయడం చాలా టఫ్ జాబ్. ‘ఇరుముడి’లో అలాంటి మ్యాజిక్ కుదిరింది.

-ఇందులో భక్తి, సైకాలజీ, క్రైమ్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మ్యూజికల్‌గా బ్యాలెన్స్ చేయడం జరిగింది. ఇలాంటి సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఛాలెంజింగ్.

ఈ సినిమాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి?
-నాకు ‘యాలాలో’ పాట చాలా ఇష్టం. ఎందుకంటే ఇది ‘ఇరుముడి’కి ఆత్మ లాంటి పాట. అలాగే ఇందులో పాటలన్నీ కూడా ఆడియన్స్ చాలా అద్భుతంగా ఆదరించారు. మొత్తం ఐదు పాటలు ఉంటాయి. అవన్నీ కూడా కథలో భాగమైన పాటలు.

శివ నిర్వాణ గారితో పనిచేయడం ఎలా అనిపించింది?
-శివ నిర్వాణ గారు చాలా మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న డైరెక్టర్. ఆయన సినిమాలో పాటలన్నీ కూడా ప్రజాదరణ పొందినవే. ఆయన మ్యూజిక్ విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. అలాగే ఆయనకి లిరిక్ నాలెడ్జ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయనకి పల్లవి వినిపిస్తే లిరిక్స్ చెప్పేస్తారు.

-ఈ సినిమా మాత్రం శివ నిర్వాణ గారి గత సినిమాలకు చాలా భిన్నంగా ఉంటుంది. చాలా సీరియస్ ఫిలిం. ‘ఇరుముడి’ సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. నా ఫేవరెట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది.

-రవితేజ గారు, ప్రియా భవానీ శంకర్ గారు, బేబీ నక్షత్ర, సాయికుమార్ గారు.. ఇలా ఈ సినిమాలో నటించిన అందరూ కూడా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

-‘విక్రమార్కుడు’ తర్వాత రవితేజ గారి సినిమాల్లో నా ఫేవరెట్ సినిమా ‘ఇరుముడి’. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది.

‘ఇరుముడి’ చాలా ఇంటెన్స్ థ్రిల్లర్. ఆడియన్స్ సినిమాని మర్చిపోలేరు. తెలుగు సినిమాలో ట్రెండ్ సెట్టర్ అవుతుంది.

నటుడిగా సంగీత దర్శకుడిగా మీ వర్క్‌ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు?
-నెలని రెండు భాగాలుగా చేస్తాను. 15 రోజులు షూటింగ్, మరో 15 రోజులు కంపోజింగ్‌లో ఉంటాను. షెడ్యూల్ విషయంలో చాలా పక్కాగా ఉంటాను. ప్రతి సినిమాకి కావాల్సిన సమయాన్ని ఇస్తాను. నా వల్ల ఏ సినిమా కూడా ఆలస్యం జరగదు.

అనిల్ రావిపూడి గారితో మీరు చేసిన ఇసుకలో పాతిపెట్టిన రీల్ చాలా వైరల్ అయింది కదా?
-అనిల్ రావిపూడి గారు చాలా స్వీట్ పర్సన్. ఆయనలో చాలా గొప్ప ఎనర్జీ ఉంటుంది. ఆయనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. మేము సరదాగా చేశాం. కాకపోతే అంత వైరల్ అవుతుందని మేము ఊహించలేదు. అందులో పాటలు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి.

ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా తెలుగు సినిమాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు అనిపిస్తుంది?
-నాకు మొదటి నుంచి తెలుగు సినిమాల్లో చేయాలనే ఉంది. కాకపోతే సరైన జర్నీ కుదరలేదు. వెంకీ అట్లూరి గారి ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వరుసగా హిట్స్ అవడంతో తెలుగులో ప్రాజెక్ట్స్ పెరిగాయి. ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉంది.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?
-అనిల్ రావిపూడి గారి సినిమా చేస్తున్నాను. అలాగే దుల్కర్ గారితో ‘ఆకాశంలో ఒక తార’, శ్రీ శ్రీ సినిమాలు చేస్తున్నాను. తమిళ్‌లో పా. రంజిత్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.

-నటుడిగా ‘Immortal’ సినిమా చేస్తున్నాను. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సెప్టెంబర్ 4న రిలీజ్ అవుతుంది. నటుడిగా తెలుగులో కూడా మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్యూ

TFJA

Recent Posts

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

9 hours ago

“అంతా రాములోరు చూస్కుంటారు” సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్…

10 hours ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య

బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్…

11 hours ago

తెలుగు చిత్ర నిర్మాతల మండలి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా మోహన్ వడ్లపట్ల ఘన విజయం*

▪️ ఉపాధ్యక్ష పదవికి నలుగురు పోటీ పడగా మోహన్ వడ్లపట్లకు అత్యధిక మెజార్టీ ▪️ ‘మన ప్యానెల్’ ప్రభంజనం హైదరాబాద్:…

15 hours ago

’90s’ వెబ్ సిరీస్ బాటలోనే ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ కూడా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది: చిత్ర దర్శకుడు ఆదిత్య హాసన్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s'…

24 hours ago

*సినీ ప్రముఖుల చేతుల మీదగా పూజ కార్యక్రమాలతో #LUB చిత్ర ప్రారంభం*

జెజె ఆర్ట్ మూవీస్, పవనసుత ప్రొడక్షన్స్, గాయత్రి సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా మహేష్ కుమార్ సంక, భగవాన్ నిర్మాతలుగా మణికంఠ…

24 hours ago