నితిన్, వెంకీ కుడుముల, మైత్రీ మూవీ మేకర్స్ రాబిన్‌హుడ్ నుంచి లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా శ్రీలీల పరిచయం
హీరో నితిన్ యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ ‘రాబిన్‌హుడ్’లో డాజ్లింగ్ దివా శ్రీలీల ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. శ్రీలీలాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఆమె పాత్రను లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా పరిచయం చేశారు.
శ్రీలీల తన చుట్టూ టైట్ సెక్యురిటీతో ప్రైవేట్ జెట్‌లో దిగినట్లు ఈ వీడియో ప్రజెంట్ చేస్తోంది. ఆమె వెయిట్ తెలియకపోయినా హెడ్ వెయిట్ ఇన్ఫినిటీ. ఆమె యారోగెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. టీజర్‌లో “జ్యోతీ, సునామీలో టి సైలెంట్ ఉండాలి… నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అని శ్రీలీల చెప్పిన డైలాగ్ అలరించింది.
మూవీలో శ్రీలీల పాత్ర, నితిన్ పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. నితిన్, శ్రీలీల పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. విజువల్స్ గ్రాండ్‌గా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్-క్లాస్‌గా వున్నాయి.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యున్నత స్థాయి ప్రొడక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు. సాయి శ్రీరామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
రాబిన్‌హుడ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కానుంది.
నటీనటులు: నితిన్, శ్రీలీల, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సిఈవో: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
లైన్ ప్రొడ్యూసర్: కిరణ్ బళ్లపల్లి
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…