డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వస్తున్న అప్డేట్లు అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఇక ప్రతీ సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ ‘కన్నప్ప’ని జనాల్లోకి మరింత తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో పార్వతీ మాతగా నటించిన కాజల్ అగర్వాల్ లుక్‌ను రీసెంట్‌గా కన్పప్ప టీం రివీల్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముకుందన్ పాత్రలకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు. తాజాగా కాజల్ అగర్వాల్ కారెక్టర్‌ను రివీల్ చేశారు. పార్వతీ దేవీగా కాజల్ అగర్వాల్ కన్నప్ప చిత్రంలో ఆడియెన్స్‌ను మెప్పించనున్నారు.
ముల్లోకాలు ఏలే తల్లి.. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి.. శ్రీకాళ హస్తిలో వెలసిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అంటూ పార్వతీ మాతను విశ్లేషిస్తూ కాజల్ అగర్వాల్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ లుక్‌ను చూస్తుంటే కాజల్ కెరీర్ బెస్ట్ కారెక్టర్ కాబోతోందని అనిపిస్తోంది. దైవత్యం ఉట్టి పడేలా ఈ లుక్ కనిపిస్తోంది.
కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లాంటి భారీ తారాగణం నటిస్తుంది. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. “కన్నప్ప” సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా ఏప్రిల్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…