‘నాయకుడు’ ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ

తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘నాయకుడు’గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు లో జులై 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ఏఆర్ రెహమాన్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… 

రెహమాన్ గారు… ‘నాయకుడు’ కథ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఎవరు మిమ్మల్ని సంప్రదించారు?
తొలుత ఉదయనిధి స్టాలిన్ గారు నన్ను సంప్రదించారు. ‘నాయకుడు’ సినిమాకు సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను. నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. నాకు నచ్చిన కథల్లో ఇదొకటి. కథ విన్నాక… సినిమా చేస్తానని చెప్పాను. 

‘నాయకుడు’ సినిమా మీ నుంచి ఏం డిమాండ్ చేసింది? ఎలాంటి మ్యూజిక్ కోరుకుంది? ప్రయోగాలు ఏమైనా చేశారా?
దర్శకుడు మారి సెల్వరాజ్ ఇంతకు ముందు తీసిన సినిమాలు పవర్‌ఫుల్‌ గా ఉంటాయి. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీయాలనుకున్నారు. ఈ కథకు మరింత మాస్ అప్పీల్ ఇచ్చారు. సంగీతం ఎక్కువ మందికి చేరువ అయ్యేలా ఉండాలనుకున్నారు. ప్రయోగాలు, కొత్తగా అంటే… చాలా రోజుల తర్వాత నేను జానపద తరహాలో గీతాలు చేశా. మ్యూజిక్ రాయల్ గా ఉండాలనుకున్నా. 

ఉదయనిధి స్టాలిన్ మీ జానపద గీతాలకు ఎలా డ్యాన్స్ చేశారని అనిపించింది?
షూటింగ్ స్టార్ట్ చేయడానికి నెల ముందు నా దగ్గరకు వచ్చారు. తొలుత ఒక పాట చాలు అన్నారు. నేనూ ఒక పాట ఇచ్చాను. మిగతా పాటలకు షూటింగ్ చేశాక… బాణీలు అందించాను. ప్రతి పాటకు ఒక అర్థం ఉంటుంది. 

మీరు ఎంజాయ్ చేసినట్టు ఉన్నారు. ‘జివ్వు జివ్వు…’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు!
(నవ్వుతు…)  ఆ పాటకు ఫన్ టచ్ ఇవ్వాలని అనుకున్నా. సాంగ్ సిట్యువేషన్ మెచ్యూర్ గా ఉంటుంది. మాస్ అండ్ ఫన్ టచ్ కోసం అలా చేశా. 

ఇటీవల మీరు ‘పొన్నియన్ సెల్వన్’ కు సంగీతం అందించారు. అదొక చారిత్రక కథ. సంగీత దర్శకుడిగా సవాల్ విసిరే సినిమా అది. ‘నాయకుడు’ తరహా కమర్షియల్ కథలకు సంగీతం అందించేటప్పుడు ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయి?
రాజకీయ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సమాజంలోని అసమానతలు, ఇంకా ఎన్నో విషయాల గురించి చర్చించారు. చాలా అంశాలపై మాట్లాడారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం ఓ కొత్త అనుభూతి. 

సంగీతంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తున్నాయి. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ ఎప్పటికీ మారదు. వైబ్రేషన్ కొంచెం చేంజ్ అవుతుంది. కానీ, మెలోడీ & లిరిక్ ఎప్పుడూ సేమ్. గత 35, 40 ఏళ్లుగా సేమ్ ఉంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే… సాంగ్ సింపుల్, క్యాచీగా ఉండాలి. బీట్ చేంజ్ అవుతుంది. మిక్సింగ్ చేంజ్ అవుతుంది. నా కోర్ కాన్సెప్ట్, మ్యూజిక్ కంపొజిషన్, థాట్ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ప్రేక్షకుల్లో, సమాజంలో మార్పులు వచ్చాయి. సంగీతంపై ఆ ప్రభావం ఉంటుంది.

ఆస్కార్ అవార్డుకు ముందు, తర్వాత అని రెహమాన్ లో ఎటువంటి మార్పులు వచ్చాయని అడిగితే ఏం చెబుతారు?
నేను సేమ్ అండి. నాలో మార్పు ఏమీ రాలేదు. అయితే… ప్రపంచంలో మనకు ఇచ్చే గౌరవం పెరిగింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ మందికి తెలిసింది.

Tfja Team

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

1 day ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

1 day ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

1 day ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago