‘బేబీ’పై హీరోయిన్ వైష్ణవీ చైతన్యఇంటర్వ్యూ

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస‌కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర హీరోయిన్ వైష్ణవీ చైతన్య మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలేంటంటే..

నా పేరు వైష్ణవీ చైతన్య. యూట్యూబర్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సోషల్ మీడియా ఇంఫ్లూయెన్సర్‌గా కొందరికి తెలుసు. బేబీ అనేది హీరోయిన్‌గా నా మొదటి సినిమా. సాయి రాజేష్ గారు నాకు హీరోయిన్‌గా అవకాశాన్ని ఇచ్చారు.

హీరోయిన్ అవ్వాలనే కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికి నా ప్రయాణం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు అవుతోంది. కానీ నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని అనుకోలేదు. ఈ పాత్ర వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. కథ విని షాక్ అయ్యాను. నాకు ఓ మంచి అవకాశం లభించిందని అనుకున్నాను. ఈ పాత్రను పోషిస్తానా? లేదా? అని నా మీద నాకు నమ్మకం లేనప్పుడు సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నా జీవితానికి ఇది చాలా గొప్ప, పెద్ద అవకాశం.

ప్రతీ యాక్టర్‌ అంతిమ లక్ష్యం సినిమానే. ఇన్ స్టాలో వీడియోలు, టిక్ టాక్ వీడియోలు చేస్తే సినిమా హీరోయిన్ అవుతుందా? అని నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా నా చుట్టూ వాళ్లు నెగెటివ్ కామెంట్లు చేశారు. అది నా మీద చాలానే ప్రభావం చూపించింది. నేను యూట్యూబ్ వరకేనా? అని అనిపించింది. కానీ సాయి రాజేష్ గారు నన్ను నమ్మారు. నాలో ధైర్యాన్ని నింపారు.

బేబీ సినిమాలో నాది ఓ బస్తీలో పెరిగే ఓ అమాయకురాలైన అమ్మాయి. బస్తీ నుంచి బయటకు వచ్చిన ఆ అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగింది? అనేది కథ. ఆ జీవితం నుంచి ఏం నేర్చుకుంటుంది? చిన్నప్పటి నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. కాలేజ్‌కు వచ్చాక మరో అబ్బాయి లైఫ్‌లోకి వస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి జీవితం ఎలా ప్రభావితం అయింది అనేది చక్కగా చూపించారు.

సాయి రాజేష్ గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇది మ్యూజిక్ ఓరియెంటెడ్ సినిమా. ఈ సినిమా కథ విన్నప్పుడు నా జీవితమే గుర్తుకు వచ్చింది. రియల్ లైఫ్‌లోంచి తీసుకున్న కథ. ఈ కథ, పాత్రతో నేను ఎక్కువగా రిలేట్ అయ్యాను. నటించేందుకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర. ఇది ఎంతో సున్నితమైన పాత్ర.

బస్తీ నుంచి కాలేజ్‌కి వచ్చిన అమ్మాయి ఎలా మారిపోయిందని చెప్పేందుకు ఈ కలర్‌ను ఓ మీటర్‌లా తీసుకున్నాం. బ్లాక్ అండ్ వైట్ అనే మీటర్‌లో చూపించలేదు. ఆ అమ్మాయి మీద ఏ విషయాలు ప్రభావితం చూపించాయి.. ఎలా మారిపోయింది? అనే కోణంలోనే చూపించాం.

బేబీ సినిమాకు సైన్ చేసి మూడేళ్లు అవుతుంది. చాలా డెప్త్ ఉన్న సీన్లు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ ప్రెజర్ అని ఫీల్ అవ్వలేదు. ఇలాంటి పాత్ర వచ్చినందుకు ఎంతో గర్వపడుతుంటాను. నా ప్రాణం పెట్టి ఈ పాత్రను చేశాను. అమ్మాయి కోణంలోంచి ఈ కథ నడుస్తుంటుంది.

షూటింగ్‌ కోసం సెట్‌లోకి వచ్చినప్పుడు భయపడుతూ ఉండేదాన్ని. కానీ టేక్ చెప్పేసరికి మేం ముగ్గురం చర్చించుకుని రెడీగా ఉండేవాళ్లం. ఆ ఇద్దరూ కూడా ఎంతో ఫ్రీడం ఇచ్చారు. డార్క్ లుక్‌లో ఉన్న సీన్‌లే ఎక్కువ ఎంజాయ్ చేశాను. సినిమా చూస్తే ఇది మన జీవితంలో జరిగినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నెగెటివ్, పాజిటివ్, హీరో, హీరోయిన్లు అని ఉండరు. పరిస్థితులే ప్రభావితం చేస్తాయి.

తొలిప్రేమ అనేది జీవితంలో ఎప్పటికీ ఓ అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఎప్పటికీ జీవితంలో మధురానుభూతిలా మిగిలిపోతుంది. ఈ సినిమాతోనూ అదే చెప్పబోతోన్నాం.

విజయ్ బుల్గానిన్ గారితో మనసే మేఘం అనే ఓ ప్రైవేట్ ఆల్బంలో చేశాను. ఇప్పుడు బేబీ సినిమాను చేశాను. ఈ సినిమాకు ఆయన బెస్ట్ గిఫ్ట్.

ఇప్పటి వరకు నేను ఏ కొత్త ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. నా ఫోకస్ మొత్తం బేబీ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక రెస్పాన్స్ చూడాలి. నేను ఏం చేయగలనో కూడా అందరికీ ఓ క్లారిటీ వస్తుంది.

ఆడిషన్స్ ఇవ్వడానికి కూడా నేను కష్టాలు పడ్డాను. ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి. ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. సినిమాల మీదే ధ్యాస ఉండేది. ప్రతీ ఫీల్డ్‌లో ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు నేను బేబీ సినిమాతో విజయం సాధించినట్టు అనిపిస్తుంది.

తెలుగు అమ్మాయిలకు చాన్స్‌లు ఇవ్వరనే మాట, ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలీదు. అలా ఏం ఉండదు. మన వంత ప్రయత్నం మనం చేయాలి. అప్పుడే అవకాశాలు వస్తాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసేందుకు ఇష్టపడతాను. గ్లామర్ రోల్స్ కంటే.. పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తాను.

బేబీ సినిమాకు ఎస్‌కేఎన్ పర్ఫెక్ట్ నిర్మాత. సాయి రాజేష్ గారిని నమ్మారు. ఈ మూడేళ్లలో ఆయనకు కూడా ఎన్నో కష్టాలు వచ్చి ఉంటాయి. కానీ బేబీ సినిమాకు అండగా నిలబడ్డాడు. కంటెంట్, కథన నమ్మారు. ఫ్రెండ్ షిప్ కోసం నిలబడ్డారు. సాయి రాజేష్ గారి మీద ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు.

Tfja Team

Recent Posts

‘పొలిమేర 3’ నుంచి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’ ఫస్ట్ లుక్ విడుదలతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ‘పొలిమేర 3..!

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో చిత్రంగా వస్తున్న 'పొలిమేర 3'పై అంచనాలు పెరుగుతున్నాయి.…

14 hours ago

మళ్లీ విద్యార్థినిగా మారిన మంచు లక్ష్మి! హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ఏం నేర్చుకుంటున్నారు?

మంచు లక్ష్మిని అర్థం చేసుకున్నామనుకునేలోపే, ఆమె మరో కొత్త ఆశ్చర్యానికి తెరతీస్తారు! ఇటీవల ఆమె సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికరమైన…

15 hours ago

‘ఆలోచన’ సినిమా ఈనెల 27న విడుదల..!

పి.ఎస్.జె. ఫిలిమ్స్ అండ్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం…

15 hours ago

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి నుంచి రాబోతోన్న ప్రొడక్షన్ నెం. 2.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..!

సుమ చిత్ర ఆర్ట్స్ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు. ‘డియర్ ఉమ’…

15 hours ago

ఆది సాయి కుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

‘శంబాల’ బ్లాక్ బస్టర్ తర్వాత ఆది సాయికుమార్ డిఫరెంట్ సబ్జెక్ట్‌లతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఈగో రాజా’…

15 hours ago

దీపావళి సందర్భంగా కార్తీక్ జయంతి ‘రాయవలస’ నుంచి పవర్ ఫుల్ పోస్టర్..!

రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో…

21 hours ago