చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ గ్రాండ్ రీ-రిలీజ్‌

Must Read

అశ్వనీ దత్ వైజయంతి మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్ ని సెలబ్రేట్ చేస్తూ, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ గ్రాండ్ రీ-రిలీజ్‌ కానుంది. బి గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంద్ర 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

ఇంద్ర చిత్రం మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ సౌత్‌ అవార్డులను గెలుచుకుంది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రెండింటినీ గెలుచుకున్నారు.

చిరంజీవితో వైజయంతీ మూవీస్ అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించింది. ఇంద్ర బ్యానర్‌కు మోస్ట్ మెమరబుల్ మూవీ. ఈ చిత్రానికి VSR స్వామి సినిమాటోగ్రఫీ అందించగా, మణి శర్మ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన ఆర్తీ అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News