ఈ కార్యక్రమానికి శ్రీ S. మూకాంబికేయన్ IRS, ఆదాయపు పన్ను జాయింట్ కమిషనర్, రేంజ్-6, హైదరాబాద్ అధ్యక్షత వహించారు, శ్రీ T. మురళీధర్ IRS, ACIT, సర్కిల్ 6(1), హైదరాబాద్, శ్రీ K. శ్రీనివాసరావు, ITO, వార్డు 14/1), హైదరాబాద్ మరియు శ్రీ O. సతీష్, ఇన్స్పెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీ దిల్ రాజు, ఛాంబర్ అధ్యక్షులు, శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, గౌరవ కార్యదర్శి ,ఛాంబర్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో, శ్రీ S. మూకాంబికేయన్, JCIT, ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి వివిధ గడువు తేదీల గురించి సభ్యులకు వివరించారు మరియు నిర్మించిన సినిమాల నిర్మాణ వ్యయం మరియు రాబడికి సంబంధించిన అకౌంటింగ్ మరియు రాబడుల అడ్మిషన్ మొదలైన వాటికి సంబంధించి చిత్ర నిర్మాతలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలను వారి ఆదాయపు పన్ను రిటర్నుల ను గురించి విశదీకరించినారు.
శ్రీ T. మురళీధర్, ACIT మరియు శ్రీ K. శ్రీనివాసరావు, ITO, సవరించిన ఫారమ్ నం.52A వివరాలు మరియు సంబంధిత గడువు తేదీలకు సంబంధించిన వివరములను చిత్ర నిర్మాతలకు తెలియచేసారు. దీని తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది.
శ్రీ దిల్ రాజు, అధ్యక్షులు, శ్రీ కె.ఎల్. దామోదర్ ప్రసాద్, గౌరవ కార్యదర్శి మరియు ఇతర సభ్యులు సినిమా నిర్మాణానికి సంబంధించిన వివిధ ఆదాయపు పన్ను సమస్యలపై చర్చించడం జరిగింది.
శ్రీ దిల్ రాజు మాట్లాడుచు ఆదాయపు పన్ను శాఖ ఈ రకమైన ఔట్ రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు, తద్వారా సభ్యులు ఆదాయపు పన్ను చట్టం మరియు ఆదాయపు పన్ను నియమాల యొక్క తాజా నిబంధనల ను వివరముగా తెలుసుకోవడం జరిగినదన్నారు.
(వి. వెంకటరమణా రెడ్డి (దిల్ రాజు) (కె.ఎల్. దామోదర్ ప్రసాద్)
అధ్యక్షులు గౌరవ కార్యదర్శి