మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నిన్న సెన్సార్ జరిగింది కదా.. రిపోర్ట్ ఎలా వుంది?
-చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. క్లిన్ ఫిల్మ్. ఫుల్ ఫ్యామిలీ ఫన్. పిల్లలు, ఫ్యామిలీతో కలసి అందరూ చూసే సినిమా అని చెప్పారు.
ఇద్దరు పెద్ద స్టార్స్ కలిసి చేసిన సినిమా కదా.. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అభిమానులు నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?
-ఇద్దరి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరూ చాలా హ్యాపీగా కలిసి పని చేశారు.
సుస్మిత గారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా.. ఈ ప్రాసెస్ ని ఎలా ఎంజాయ్ చేశారు?
-ఇది మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం ఒగ గౌరవంగా భావిస్తున్నాము. నాన్నగారి కోర్ జానర్ లో చేయడం, అనిల్ గారు ఆ జానర్ ని తీసుకోవడం సూపర్బ్. సాహు గారితో జర్నీ బ్యూటీఫుల్. ఇది చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ మళ్ళీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను.
-ఈ సినిమాతో నాన్న గారు ఒక కొత్త ట్యాలెంట్ బాక్స్ ని ఓపెన్ చేసినట్లుగా అనిపించింది. రౌడీ అల్లుడు సినిమాలో చూసినట్లుగా వుందని ఫ్యాన్స్ అంటున్నారు. వింటేజ్ ఛార్మ్ ని గుర్తు చేస్తునే ఇందులో ఆయన నటన చాలా ఫ్రెష్ గా వుంటుంది.
-నాన్న గారు బరువు తగ్గడంతో పాటు ఫిట్ నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. చాలా కొత్త ఛార్మ్ తో కనిపించారు. దీంతో ఆయనకి కాస్ట్యుమ్స్ డిజైన్ చేయడం కూడా మాకు ఈజీ అయ్యింది. అలాగే అనిల్ గారు ఆయన్ని ఒక స్టయిల్ లో చూపించాలని అనుకున్నారు. ఆయన వైపు నుంచి కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అందరం ఒకే విజన్ తో పని చేశాం.
సాహు గారు.. సంక్రాంతికి చాలా సినిమా వున్నాయి.. థియేటర్స్ ఇబ్బంది ఉంటుందనే మాట వినిపిస్తుంది ?
– మాకు రన్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సంక్రాంతిలో ముందు నుంచి మా సినిమా వుంది. అయితే ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఒకటో అర థియేటర్స్ తగ్గడం సహజమే. కాకపోతే మా సినిమా వరకూ థియేటర్స్ సమస్య పెద్దగా లేదు.
సుస్మిత గారు .. వెంకటేష్ గారి పాత్ర ఎలా ఉండబోతోంది?
-వెంకటేష్ గారు బిగ్ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింత గా రైజ్ అవుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ వున్న రిచ్ క్యారెక్టర్.
సాహు గారు.. చిరంజీవి గారి పాత్ర ఎలా వుంటుంది ?
-ట్రైలర్ చిరంజీవి గారి క్యారెక్టర్ కి సంబంధించి షేడ్స్ చూపించాం. ఆయన క్యారెక్టర్ లో ఫన్ యాక్షన్ ఎమోషన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వుంటాయి. వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య చాలా అద్భుతమైన కామెడీ సీన్స్ వుంటాయి. ట్రైలర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. ట్రైలర్ లో చిరంజీవి గారు క్యారెక్టర్ ని పరిచయం మాత్రమే చేశాం. సినిమాలో చాలా వుంది. ఈ సినిమా సంక్రాంతి విందు అనేది చిన్న మాట.. సినిమా చూశాను కాబట్టి చెబుతున్నాను. అద్భుతంగా వుంటుంది.
-ప్రతి సీన్ లో ఆడియన్స్ ముఖంలో చిరునవ్వు వుంటుంది. ఫన్ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా చాలా రియల్ గా వుంటుంది.
చిరంజీవి గారిని ప్రమోషన్స్ లో ఎప్పటినుంచి చూడబోతున్నాం?
-అన్ని ఏరియాల్లో ప్రమోషన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. అనిల్ గారు ఫుల్ స్పీడ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు.
-చిరంజీవి గారు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ లో బిజీగా వున్నారు. రేపటి నుంచి ఆయన వర్క్ అయిపోతుంది. ప్రీరిలీజ్ ఈవెంట్ వుంది. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరూ వస్తున్నారు. ఆ నెక్స్ట్ నుంచి ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అవుతారు.
ఇందులో ఒక స్పెషల్ సాంగ్ వుంది. అందులో వింటేజ్ చిరంజీవి గారిని చూస్తారు. నిన్న ఓవర్సిస్ ఆడియన్స్ తో మంచి వీడియో కాల్ కూడా అయ్యింది.
ఈ మూవీ టైటిల్ ఐడియా ఎవరిది?
-ఇది అనిల్ గారి ఐడియా. ఈ క్యారెక్టర్ పై ఫోకస్ ఉండేలా.. ఒరిజినల్ పేరే పెట్టేసుకోవాలని అనిల్ గారు భావించారు.
సుస్మిత గారు .. చిరంజీవి గారు ఎందరికో స్ఫూర్తి.. మీరు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు?
-నేర్చుకోవాలనే తపన వుంటే ఆయన నుంచి ప్రతిరోజు ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఈ సినిమాలో జర్నీ చేస్తున్నప్పుడు ఒక పని మొదలుపెట్టిన తర్వాత దాని కోసం ప్రాణం పెట్టి నిజాయితీగా హార్డ్ వర్క్ చేయాలనేది నేర్చుకున్నాను.
-డాడీ ఇంట్లో మా అందరితో చాలా ఫన్ ఫుల్ గా వుంటారు. ఒకసారి సెట్ లో అడుగుపెట్టిన తర్వాత ఆయన పూర్తి దృష్టి క్యారెక్టర్ పైనే వుంటుంది. ఈ రోజుకీ ఒక ఫస్ట్ టైమర్ లా ఆయన ప్రిపరేషన్ వుంటుంది.
బాబాయ్ గారితో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?
ఆ గాడ్ గిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. సినిమా కోసం అడిగాను. లైన్ లో వున్నాను. ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను(నవ్వుతూ)
భీమ్స్ మ్యూజిక్ గురించి?
-మ్యూజిక్ అద్భుతంగా చేశారు. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. రీరికార్డింగ్ కూడా అదిరిపోతుంది.
-సమీర్ రెడ్డి గారు అద్భుతమై విజువల్స్ చూపించారు. ఫెంటాస్టిక్ గా వున్నాయి.
ప్రిమియర్స్ గురించి?
టికెట్స్ రేట్స్ క్లారిటీ రాగానే.. ప్రిమియర్స్ గురించి చెప్తాం.
సాహుగారు.. ఇంతకీ జన నాయకుడు.. భగవంత్ కేసరి రీమేకా? కదా?
-ట్రైలర్ చూశాకా.. మీకు అర్ధమైవుంటుంది. అది రీమేకే. ట్రైలర్ లో అన్ని చెప్పురు కదా.. సినిమాలో రైట్స్, క్రెడిట్స్ వుంటాయి.
సాహుగారు.. అనిల్ గారి నెక్స్ట్ సినిమా కూడా మీరే చేస్తున్నారా?
అవును. చేస్తున్నాం.
మనశంకర వర ప్రసాద్ కి సీక్వెల్ వుంటుందా ?
లేదండి.
మనశంకర వర ప్రసాద్ గారు ఎలా ఉండబోతుంది?
ఇందులో కామెడీ యాక్షన్ ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. చిరంజీవి గారి నుంచి ఏమైతే మిస్ అయ్యామో అవన్నీ ఇందులో వుంటాయి. మనమంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాం. అలాంటి చిరంజీవి గారిని ఇందులో చూస్తారు. చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు కలిస్తే ఎంత ఎంటర్టైమెంట్ వుంటుందో ఇందులో చూస్తారు.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంతో తొలిసారిగా దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్, తానే…