దసరాలో వెన్నెల అందరికీ కనెక్ట్ అవుతుంది: కీర్తి సురేష్

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్  వచ్చింది. దసరా ట్రైలర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతూ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది. కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో కీర్తి సురేష్ విలేఖరు సమావేశంలో దసరా విశేషాలని పంచుకున్నారు.

దసరాలో మీ పాత్ర సవాల్ తో కూడుకున్నదిగా అనిపిస్తోంది. మేకప్ కూడా డార్క్ గా వుంది. మీ పాత్ర గురించి  ?

దసరాలో సవాల్ తో కూడుకున్న పాత్ర చేశా. మేకప్ వేయడానికి, తీయడానికి కూడా కొన్ని గంటలు పట్టేది. దుమ్ము , బొగ్గు ఇలా రస్టిక్ బ్యాక్ డ్రాప్ లో షూట్ చేశాం.  మేకప్ తీసి మళ్ళీ మామూలు స్థితికి రావడానికి చాల సమయం పట్టేది. తెలంగాణ యాస మాట్లాడే పాత్ర. మొదట కష్టం అనిపించిది. తర్వాత అలవాటైపోయింది. ఇందులో నా పాత్ర పేరు వెన్నెల. నా కెరీర్ లో పోషించిన ఓ ఛాలెజింగ్ రోల్ ఇది. వెన్నెల అనే పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది.

తెలంగాణ యాస మాట్లాడటం ఎలా అనిపించింది ?

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అసోసియేట్ శ్రీనాథ్ నాకు తెలంగాణ యాస నేర్పించారు. ఆయనకి మొత్తం యాస మీద పట్టుంది. అలాగే ఒక ప్రొఫెసర్ కూడా వున్నారు. చాలా చిన్న చిన్న వివరాలు కూడా యాడ్ చేశారు. దసరాకి నేనే డబ్బింగ్ చెప్పా. మాములుగా అయితే రెండు లేదా మూడు రోజులు డబ్బింగ్ చెబుతా. కానీ దసరాకి మాత్రం ఐదారు రోజులు పట్టింది.

దసరా చేస్తున్నప్పుడు మహానటి వైబ్స్ వచ్చాయని అన్నారు కదా ? ఏ రకంగా మహానటి గుర్తు వచ్చింది ?

ఒక సినిమాతో ఒక ఫీల్ వుంటుంది. సినిమా పూర్తి చేసిన తర్వాత కూడా దానితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఫీలౌతాం. అది మహానటికి వుండేది. ఇప్పుడు దసరాకి  వచ్చింది. 

‘మహానటి’కి జాతీయ అవార్డ్ వచ్చింది కదా.. దసరాకి కూడా వస్తుందని భావిస్తున్నారా ?

నేనేం ఆశించడం లేదండీ. నిజానికి మహానటి కూడ నేను ఆశించలేదు. అందరి బ్లెసింగ్స్ తో వచ్చింది. సినిమా బాగా ఆడాలి, అందరూ వారి బెస్ట్ వర్క్ ని ఇవ్వాలని మాత్రమే అనుకుంటాను.

దసరాకి ఎలాంటి హోం వర్క్ చేశారు ?

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథని అద్భుతంగా రాసుకున్నారు. ఏ పాత్ర ఎలా ఉండాలో అయనకి చాలా క్లారిటీ వుంది. దర్శకుడు పాత్ర, కథని ఒక మీటర్ లో అనుకుంటారు. ఆ మీటర్ ని అర్ధం చేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలనిఅనుకుంటున్నాను.. దర్శకుడు ఏం కోరుకుంటున్నారు .. దాన్ని అర్ధం చేసుకొని క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలనే దానిపై వర్క్ చేశాం.

నేను లోకల్ తర్వాత నాని గారితో పని చేయడం ఎలా అనిపించిది ?

నాని గారితో నేను లోకల్ తర్వాత ఇలాంటి పాత్ర కోసం చాలా వెయిట్ చేసి చేసిన సినిమా దసరా. నాని గారితో చాలా కాలం తర్వాత కలసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెన్నెల చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూశాను.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గురించి ?

శ్రీకాంత్ ఎక్స్ లెంట్ డైరెక్టర్. తన వర్క్ చూస్తే మొదటి సినిమా చేస్తున్న దర్శకుడిలా అనిపించలేదు. తనకి చాలా క్లారిటీ వుంది. ఇండస్ట్రీ కి శ్రీకాంత్ లాంటి దర్శకుడు రావడం ఆనందంగా వుంది. భవిష్యత్ లో తను అద్భుతమైన చిత్రాలని అందిస్తాడు.

చమ్కీల అంగీలేసుకొని పాట చాలా పాపులర్ అయ్యింది కదా.. ఇంత పాపులర్ అవుతుందని ముందే అనుకున్నారా ?

ఆ పాట వినగానే అన్ని పెళ్లిల్లో ఇదే పాట మారుమ్రోగుతుందని అనుకున్నాం. పాటలో ఆ వైబ్ వుంది. లిరిక్స్ చాలా అందంగా వుంటాయి. అప్పుడే పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం. మేము ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధించింది.

మహానటి తర్వాత మీరు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తారాని వార్తలు వచ్చాయి. కానీ మీరు వెళ్ళలేదు. దసరా ఇప్పుడు పాన్ ఇండియా విడుదల అవుతుంది కదా ? దిని గురించి ?

కొన్ని కథలు విన్నాను. కానీ బలమైన పాత్ర అనిపించలేదు. ఇప్పుడు దసరా పాన్ ఇండియా విడుదలౌతుంది కాబట్టి బలమైన పాత్రలు వస్తాయో చూడాలి. నాకు మాత్రం చేయాలనే వుంది. అయితే ముందు మంచి పాత్రలు, కథలు కుదరాలి.

ఆల్ ది బెస్ట్

థాంక్స్

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago