కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కస్టడీ టీం
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ‘ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటి. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా ని నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్‌కుమార్ సమర్పిస్తున్నారు శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం మే 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
హీరో నాగచైతన్య మాట్లాడుతూ, కస్టడీ సినిమాను ఆదరిస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మేం నమ్మి చేసిన అండర్‌వాటర్ సీన్, పోలీస్ స్టేషన్ లో సింగిల్ షాట్ ఫైట్, ట్రైన్ ఫైట్, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ సీన్ కు మంచి స్పందన వచ్చింది. రొటీన్ గా కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నం చేశాను. ఆదరిస్తున్న ఆడియన్స్ కు అభినందనలు తెలుపుతున్నా. మమ్మల్ని నమ్మి చేసిన నిర్మాత, దర్శకుల కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు.
హీరోయిన్ కృతిశెట్టి మాట్లాడుతూ, దర్శకుడు వెంకట్ ప్రభు గారు నన్ను నమ్మి మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు థియేటర్ లో మంచి అప్లాజ్ వస్తుంది. నాగచైతన్య తో నటించడం చాలా ఆనందంగా వుంది. అలాగే వెన్నెల కిశోర్, సంపత్ గారితో నటించడం ఆహ్లాదంగా ఉంది. కస్టడీ సినిమా హిట్ అయిందంటే అందుకు ఆడియన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు చాలా వున్నాయి. పోలీస్ స్టేషన్ ఫైట్ గానీ, అండర్ వాటర్ సీన్ గానీ ఖర్చుపెట్టి నిర్మాత తీయించారు. అవి చాలా అద్భుతంగా దర్శకుడు తీశారు. థియేటర్ లో వాటికి మంచి స్పందన వస్తోంది అన్నారు.
చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ, తెలుగులో నేను చేసిన మొదటి సినిమా కి వస్తున్న గొప్ప ఆదరణకు థ్యాంక్స్ చెబుతున్నా. వందశాతం మా కష్టం ఫలించింది అనుకుంటున్నా. అంబులెన్స్ తో కంపేర్ చేస్తూ కొన్ని రివ్యూలు చూశాను. అలా వారు రాసినందుకు థ్యాంక్స్. యాక్షన్ ఫిలిం ఇది. యాక్షన్ పరంగా బాగున్నాయని రాశారు కూడా. 4 నిముషాల సింగిల్ షాట్ ఫైట్ ను మహేష్ కొరియోగ్రఫీ చేశారు. ఈ రిస్కీ షాట్ ను అవసరమైతే మరోసారి చేస్తాను అనికూడా నాగచైతన్య అన్నారు. ఆయన డెడికేషన్ నచ్చింది. కస్టడీ సినిమా ను తెలుగు, తమిళంలో కూడా బాగా ఆదరిస్తున్నారు. కుటుంబంతో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని కోరారు.
నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి మాట్లాడుతూ, కస్టడీ బ్లాక్ బస్టర్ అయినందుకు ఆనందంగా వుంది. కథలో ఏది నమ్మామో అది వర్కవుట్ అయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతున్నాం అన్నారు.
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…
ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…