కిరణ్ అబ్బవరం కి నేను పెద్ద అభిమానిని – నాగచైతన్య

Must Read

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న దీపా‌వళి పండుగ సందర్భంగా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “క” సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ – ఈ రోజు “క” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మా మూవీకి టీమ్ అంతా ఏడాదిన్నర కష్టపడ్డాం. ఈ నెల 31న ఒక బ్యాంగ్ లాంటి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. “క” సినిమా థియేటర్స్ లో మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. అన్నారు.

డీవోపీ సతీష్ రెడ్డి మాసం మాట్లాడుతూ – “క” సినిమాకు హోల్ అండ్ సోల్ క్రెడిట్ కిరణ్ అబ్బవరం గారికే ఇవ్వాలి. మా డైరెక్టర్స్ ప్రతి సీన్ ను స్టోరీ బోర్డ్ తో సహా పక్కాగా తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా మూవీని థియేటర్స్ లో తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడక్షన్ హెడ్ మణి మాట్లాడుతూ – “క” సినిమా చాలా బాగా వచ్చింది. ఈసారి మా అన్న కిరణ్ సక్సెస్ కొట్టబోతున్నాడు. మీరంతా థియేటర్స్ కు వెళ్లి ఈ సినిమా చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చవాన్ మాట్లాడుతూ – మా మూవీ ఇంత బాగా రావడానికి టీమ్ అంతా పెట్టిన ఎఫర్ట్స్ కారణం. క ప్రొడక్షన్స్, శ్రీచక్రాస్ ఎంటర్ టైమ్ మెంట్స్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. మా కిరణ్ గారు ఎప్పుడూ మాకు వెన్నంటే ఉన్నారు. “క” సినిమాలో వావ్ ఫ్యాక్టర్స్ , హై మూవ్ మెంట్స్ చాలా ఉంటాయి. సినిమా చివరి 8 నిమిషాలు మిస్ కావొద్దు. అన్నారు.

సీయీవో రహస్య గోరక్ మాట్లాడుతూ – ఈ రోజు “క” ప్రీ రిలీజ్ కు వచ్చిన నాగ చైతన్య గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. కిరణ్ తన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి హైస్ అండ్ లోస్ చూస్తూ వస్తున్నారు. తనకు సక్సెస్ రావాలని మీరంతా కోరుకున్నారు. సపోర్ట్ గా నిలిచారు. గోపాలకృష్ణ రెడ్డి గారు మాకెంతో తోడ్పాటు అందించారు. మీ విశెస్ అన్నీ మాకు రీచ్ అవుతున్నాయి. అందుకే “క” లాంటి సినిమా చేయగలిగాం. ఇది మా అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్. మీ బ్లెస్సింగ్స్ తో మా మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ చింతా వినీషా రెడ్డి మాట్లాడుతూ – “క” సినిమా ఈవెంట్ కు వచ్చిన వారందిరికీ థ్యాంక్స్. మా మూవీ ట్రైలర్ మీకు నచ్చినట్లే సినిమా కూడా నచ్చుతుంది. మా మూవీ టీమ్ అంతా ఎంతో హర్డ్ వర్క్ చేసి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నారు. తప్పకుండా మీ సపోర్ట్ దక్కుతుందని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ చింతా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ – “క” మూవీకి మెయిన్ పర్సన్ మా కిరణ్ అన్న. అలాగే మా హీరోయిన్స్ తన్వీరామ్, నయన్ సారిక మెచ్యూర్డ్ పర్ ఫార్మెన్స్ చేశారు. సినిమాను ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేలా మా డైరెక్టర్స్ రూపొందించారు. “క” సినిమా మా సంస్థకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ – మా “క” మూవీ ఈవెంట్ కు నాగ చైతన్య లాంటి మంచి మనసున్న హీరో రావడం సంతోషంగా ఉంది. కిరణ్ గారి మీద నాకు నమ్మకం ఉండే ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాను. ఆయన నాకు ఏ మాటైతే ఫస్ట్ ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్నీ తానై ప్రాజెక్ట్ సక్సెస్ ఫుల్ గా స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు. నాకు రిస్క్ లు చేయడం ఇష్టం. మా హీరోయిన్స్ బాగా నటించారు. డైరెక్టర్స్ సందీప్, సుజీత్ అందరినీ ఆకట్టుకునేలా సినిమా రూపొందించారు. సామ్ సీఎస్ తన మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం పోశారు. తప్పకుండా మా సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తుంది. అన్నారు.

హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ – “క” లాంటి బ్యూటిఫుల్ ఫిలింలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. మీకు నా సత్యభామ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అలాగే సినిమా అంతా యూనిక్ గా ఉంటుంది. ఫుల్ సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కిరణ్ గారితో కలిసి వర్క్ చేయడం సంతోషంగా ఉంది. ఆయన ఇంతే డెడికేషన్ తో తను అనుకున్న అన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ ఫుల్ గా చేయాలని కోరుకుంటున్నా. నేను తన్వీ రామ్ మంచి ఫ్రెండ్స్ అయ్యాం. “క” సినిమాకు ప్రతి డిపార్ట్ మెంట్ ఎంతో ప్యాషన్ తో హార్డ్ వర్క్ చేసింది. అన్నారు.

హీరోయిన్ తన్వీరామ్ మాట్లాడుతూ – ఈ సినిమాలో రాధ అనే క్యారెక్టర్ లో నటించాను. తనొక స్కూల్ టీచర్. నా క్యారెక్టర్ సినిమాలో కీలకంగా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ నచ్చే మూవీ చేసేందుకు ముందుకొచ్చాను. మరో రెండు రోజుల్లో మా సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. తప్పకుండా చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ – మా ఫ్యామిలీ నుంచి దక్కిన ఎంకరేజ్ మెంట్ వల్లే మేము ఇక్కడిదాకా రాగలిగాం. ఈ రోజు ఈ వేదిక మీద నిలబడి ఉన్నామంటే అందుకు కిరణ్ అన్న ఇచ్చిన సపోర్ట్ కారణం. ప్రొడక్షన్ కు సంబంధించిన ఏ ప్రాబ్లమ్ మా దాకా రానీయకుండా కిరణ్ అన్న చూసుకున్నారు. రాధ క్యారెక్టర్ లో తన్వీ చాలా బాగా నటించింది. అలాగే రాధ, అభినయ వాసుదేవ్ ఎలా కలుస్తారు అనేది స్క్రీన్ మీద చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. నయన్ సారిక చాలా చలాకీ హీరోయిన్. తను సత్యభామగా బాగా పర్ ఫార్మ్ చేసింది. బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు డీవోపీలు విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం. అలాగే సుధీర్ ప్రొడక్షన్ డిజైన్ పీరియాడిక్ కథ నుంచి ఒక్క క్షణం కూడా మిమ్మల్ని బయటకు రానీయదు. మ్యూజిక్ తో సామ్ సీఎస్ గారు మరో స్థాయికి సినిమాను తీసుకెళ్లారు. ఈ నెల 31వ తేదీ “క” సినిమాదే అని నమ్మకంగా చెప్పగలను. అన్నారు.

డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ – మేము మూడేళ్ల క్రితం ఈ సినిమా కల గన్నాం. ఆ కలను నిజం చేసిన మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్. అలాగే కిరణ్ అన్న ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. మా మూవీలో 600 సీజీ షాట్స్ ఉంటాయి. అవన్నీ పర్పెక్ట్ చేయగలిగాం. మా టీమ్ లోని ప్రతి డిపార్ట్ మెంట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి పనిచేశారు. ఈ నెల 31న థియేటర్స్ లోకి వస్తున్నాం. సక్సెస్ కొడుతున్నాం. “క” మీద మా అందరిలో ఉన్న నమ్మకం ఇదే. అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గోరక్ మాట్లాడుతూ – “క” ప్రాజెక్ట్ ను నమ్మి మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. కిరణ్ గారి పర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే టీమ్ లోని ప్రతి ఒక్కరూ మూవీ బాగా రావాలని ఎంతో కష్టపడ్డారు. సినిమా క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అనేది టీమ్ లో ఉన్న నేనే ఊహించలేకపోయాను. ప్రేక్షకులు ఆ ట్విస్టులు ఎక్స్ పెక్ట్ చేయరు. తప్పకుండా ఈ థ్రిల్ ను థియేటర్ లో ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ – మా “క” సినిమా ప్రీ రిలీజ్ కు వచ్చిన నాగ చైతన్య గారికి థ్యాంక్స్. మా మూవీలో ది బెస్ట్ స్క్రీన్ ప్లే చూస్తారు. “క” సినిమా స్క్రీన్ ప్లేకు ప్రెస్టీజియస్ అవార్డ్స్ వస్తాయి. ఈ రోజు ప్రీ రిలీజ్ చేశాం. రేపు ప్రీమియర్స్ వేస్తున్నాం. క్రాకర్స్ తో సెలబ్రేషన్స్ ముందే బిగిన్ చేయబోతున్నాం. “క” సినిమా తప్పకుండా సక్సెస్ అందుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – “క” సినిమా కంటెంట్ ను నా మిత్రుడు వంశీ నందిపాటి చూపించాడు. మెస్మరైజింగ్ గా ఉంది కంటెంట్. సినిమా చివరి పది నిమిషాలు మాత్రం ర్యాంపేజ్ లా ఉంటుంది. కిరణ్ అబ్బవరం కంటెంట్ మీద సినిమాలు చేసే హీరో. ఇలాంటి హీరోలు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారికి నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అలాగే సినిమాను రిలీజ్ చేస్తున్న నా ఫ్రెండ్ వంశీకి ఆల్ ది బెస్ట్. తను పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈరోజు “క” సినిమాకు కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కూడా తనకు మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే మోస్ట్ హంబుల్ హీరో నాగ చైతన్య గారికి థ్యాంక్స్ చెబుతున్నా ఈ ఈవెంట్ కు వచ్చినందుకు. తప్పకుండా “క” సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ – ఈ రోజు మా “క” మూవీ ప్రీ రిలీజ్ కు నాగ చైతన్య గారి లాంటి మంచి పర్సన్ గెస్ట్ గా రావడం హ్యాపీగా ఉంది. ఆయన పాజిటివిటీతో మాకూ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. నాకు సినిమానే ప్రాణం. అందుకే ఏ ఉద్యోగం చేసినా మనసు సినిమా వైపే లాగేది. అలా ఇండస్ట్రీకి వచ్చాను. సక్సెస్ వచ్చింది. పెద్ద బ్యానర్స్ లో మూవీస్ చేశా. అయితే కొన్ని ఆడాయి, కొన్ని సినిమాలు ఆడలేదు. అయితే ప్రతి రోజూ సినిమా కోసం కష్టపడుతూనే వచ్చాను. ఎంతో బాధపడేవాడిని అనుకున్నట్లు సినిమాలు మీకు రీచ్ కావడం లేదని. నా కెరీర్ లో 8 సినిమాలు చేస్తే 4 సినిమాలు డీసెంట్ గా ఆడాయి. నేను యాక్టర్ గా ఫెయిల్ కాలేదు. ప్రతి హీరోకు ఫెయిల్యూర్స్ ఉంటాయి. నా లాంటి హీరో తన సినిమాను థియేటర్ దాకా తీసుకురావడమే సక్సెస్. అలా నా సినిమాలు నేను చేసుకుంటూ వెళ్తున్న టైమ్ లో ఒకరు తమ సినిమాలో నాపై ట్రోలింగ్ డైలాగ్స్ పెట్టారు. నేను మీకు ఏం చేశానని అలా నన్ను తక్కువ చేసేలా మీ సినిమాలో డైలాగ్స్ పెట్టారు. నాకు బాధగా అనిపించి ఈ వేదిక మీద ఆ విషయం మాట్లాడుతున్నా.
“క” సినిమా విషయానికొస్తే నేను లాస్ట్ ఇయర్ చెప్పాను. ఏడాదిలో ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తానని. చెప్పినట్లే క అనే మంచి సినిమాతో మీ ముందుకు ఈ నెల 31న రాబోతున్నాం. “క” సినిమా బ్యాడ్ మూవీ అని మీలో ఎవరైనా అంటే నేను సినిమాలు చేయడం మానేస్తా. ఎవరెవరికి ఎంత నచ్చుతుందో తెలియదు గానీ మంచి ప్రయత్నం అని మాత్రం అంటారు. నేను ప్రామిస్ చేస్తున్నా. థియేటర్స్ కు వెళ్లండి “క” సినిమా మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ – నేను ఇంట్రోవర్ట్ పర్సన్ ను. కొత్త వాళ్లతో పెద్దగా కలవను. అయితే రీసెంట్ గా కిరణ్ చెన్నైలో కలిశాడు. అతనితో మాట్లాడిన కొద్దిసేపటికే చాలా దగ్గరి ఫ్రెండ్ లా అనిపించాడు. తనకు నా వల్ల అయిన సపోర్ట్ చేయాలనిపించింది. కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నెంబర్ వన్ ఫ్యాన్ ను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో మంచి ప్రొటెక్షన్ తో వచ్చాను. తనకు ఎవరి సపోర్ట్ లేదు. స్వతహాగా ఎదిగాడు. కిరణ్ సక్సెస్ స్టోరీ నాకు ఇన్సిపిరేషన్ గా నిలుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చే ఎంతోమందికి కిరణ్ స్ఫూర్తిగా నిలుస్తారు. ఇలాంటి హీరోస్ సక్సెస్ కావాలి. నేను “క” సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. కిరణ్ ఫోన్ చేసి ప్రి రిలీజ్ కు గెస్ట్ గా రావాలని పిల్చినప్పుడు హ్యాపీగా ఫీలయ్యా. ఇలాంటి మంచి మూవీ ప్రమోషన్ లో భాగమవడం సంతోషంగా ఉంది. కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క సినిమా ప్రీ రిలీజ్ కు వెళ్తున్నానని ఒక ఫ్రెండ్ కు చెబితే కిరణ్ అబ్బవరం క సినిమానా అన్నారు. అంటే సినిమా ముందు నీ పేరు రికగ్నైజ్ అవుతోంది. నువ్వు ఆ గుర్తింపు తెచ్చుకున్నావు. నీ ఇంటర్వ్యూస్ చూశాను. ఎంతో ర్యాగింగ్ ప్రశ్నలకు కూడా మెచ్యూర్డ్ గా సమాధానాలు చెప్పావు. నీలో ఎంతో శక్తి ఉంది కిరణ్ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ జర్నీ అమేజింగ్. ట్రోల్ చేసే వారికి కీ బోర్డ్ తప్ప బ్రెయిన్ లో ఏమీ ఉండదు. ట్రోల్స్ కు భయపడే స్థాయి దాటేశావు. ఫ్లాప్స్, హిట్స్ ఎవరికైనా కామన్. ప్రతి వారి సక్సెస్ వెనకాల మహిళ సపోర్ట్ ఉంటుంది. కిరణ్ కు వాళ్ల అమ్మతో పాటు రహస్య సపోర్ట్ కూడా దొరికింది. “క” సినిమా టీమ్ ను కలిసినప్పుడు వారు సినిమా కోసం ఎంత హానెస్ట్ గా కష్టపడ్డారో తెలిసింది. “క” సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. “క” సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ – శ్రీ వరప్రసాద్
డీవోపీస్ – విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం
మ్యూజిక్ – సామ్ సీఎస్
ప్రొడక్షన్ డిజైనర్ – సుధీర్ మాచర్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చవాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – రితికేష్ గోరక్
లైన్ ప్రొడ్యూసర్ – కేఎల్ మదన్
సీయీవో – రహస్య గోరక్ (కేఏ ప్రొడక్షన్స్)
కాస్ట్యూమ్స్ – అనూష పుంజ్ల
మేకప్ – కొవ్వాడ రామకృష్ణ
ఫైట్స్ – రియల్ సతీష్, రామ్ కృష్ణన్, ఉయ్యాల శంకర్
కొరియోగ్రఫీ – పొలాకి విజయ్
వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ -ఎంఎస్ కుమార్
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – ఫణిరాజా కస్తూరి
కో ప్రొడ్యూసర్స్ – చింతా వినీషా రెడ్డి, చింతా రాజశేఖర్ రెడ్డి
ప్రొడ్యూసర్ – చింతా గోపాలకృష్ణ రెడ్డి
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన దర్శకత్వం – సుజీత్, సందీప్

Latest News

నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్

అక్టోబర్ 30, 2024: తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, సినిమాల్లో అద్భుతమైన నటనతో అలరిస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార ' బియాండ్ ది ఫెయిరీ...

More News