‘జాక్-కొంచెం క్రాక్’ సినిమాలో నవ్విస్తూనే బాధ్యతతో ఉండే పాత్రలో కనిపిస్తాను – హీరో సిద్ధు జొన్నలగడ్డ

Must Read

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కిస్ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ గురువారం రోజున విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో

పాటల రచయిత సనారె మాట్లాడుతూ ‘‘శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో పాట రాయటం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ భాస్కర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలిగారికి, నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, పాటను పాడిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ‘‘నాకు ఈ సినిమాలో వర్క్ చేసే అవకాశం ఇచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ గారికి థాంక్స్. ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్ తో ఈ సినిమాలో వర్క్ చేసే అవకాశం నాకు కలిగింది. నిర్మాతలు బాపినీడు, బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి థాంక్స్’’ అన్నారు.

నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘సిద్ధు యూత్‌లోనే కాదు.. అన్నీ ఏజ్‌ల వారికి స్టార్ బాయ్‌గా మారారు. ‘జాక్’ సినిమాను భాస్కర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.

హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘‘ఇంత మంచి పాటను రాసిన సనారెకి థాంక్స్. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా పాటను రాశారు. ఇంత మంచి ట్యూన్ ను అందించిన సురేష్ గారికి. డైరెక్టర్ భాస్కర్ గారికి థాంక్స్. ఏప్రిల్ 10న మా జాక్ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. మీకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘మూవీకి ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే టైటిల్ పెట్టటానికి కారణం.. రైమింగ్ తో పాటు హీరో క్యారక్టరైజేషన్. సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి మనిషి లైఫ్ లో ఓ గోల్ ఉంటుంది. అయితే ఏ పని చేస్తున్నామనే దాంతో పాటు ఆ పనిని మనం ఎలా చేస్తున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓ పనిని ఇలానే ఎందుకు చేయాలి.. మరోలా నేను చేస్తానని కొందరు అంటుంటారు. అలాంటి వాడిని చూస్తే మనం క్రాక్ అంటుంటాం. అందుకనే ఈ టైటిల్ పెట్టాం. హీరో క్యారెక్టరైజేషన్ గురించి భాస్కర్ గారు చెప్పగానే నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను. నేను కూడా రైటర్‌ని కాబట్టి కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను.. దాన్ని భాస్కర్‌గారు ఆయన కథకు అనుగుణంగా డెవలప్ చేశారు. ప్రేక్షకులను నవ్విస్తూనే రెస్పాన్సిబుల్‌తో ఉండే పాత్రలో కనిపిస్తాను. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News