50 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్‌ రూల్‌! పుష్ప-2 ది రూల్‌

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప-2 దిరూల్‌ మీదే. ఈ సినిమాకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమ యావత్‌ ఎదురుచూస్తున్న సినిమా ఇది. అది మన తెలుగు సినిమా కావడం గర్వకారణం. ఇక ‘పుష్ప-2’ ది రూల్‌.. డిసెంబరు 6న ప్రారంభం కానున్న పుష్పరాజ్‌ రూల్‌కు కౌంట్‌స్టార్‌ అయ్యింది. మరో50 రోజుల్లో అంటే డిసెంబరు 6న పుష్ప-2 రూల్‌ బాక్సాఫీస్‌పై ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఐకాన్‌స్టార్‌ మాసివ్‌ లుక్‌తో పుష్పరాజ్‌గా రూల్‌ చేయడానికి సింహాసనం అధిష్టించిన ఓ పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు డిసెంబరు 6న భారతీయ సినిమాలో ఆ రోజు ఓ సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుందని హింట్‌ ఇచ్చారు మేకర్స్‌ ప్రతి సీన్‌కు గూజ్‌బంప్స్‌తో పాటు పుష్ప ది రూల్‌కు అందరూ ఫిదా అయిపోవాల్సిందే అంటున్నారు. మీరు ఎంత ఊహించుకుంటే అంతకు మించి.. అస్సలు తగ్గేదెలే లా చిత్రం వుండబోతుందనే విశ్వాసంతో వున్నారు చిత్ర మేకర్స్‌. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. అద్వితీయమైన నటనతో..ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ‘పుష్ప-2’లో మైస్మరైజింగ్‌ నటన కోసం, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ టేకింగ్‌..మేకింగ్‌.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల పతాకంపై ప్రముఖ నిర్మాతలు, నవీన్ ఏర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌, టీజర్‌కు ఎంతటి అనూహ్యమైన స్పందన వచ్చిందో తెలిసిందే. దేవి శ్రీప్రసాద్‌ అందించిన అందించిన ట్రెండీ పాటలకు అద్వితీయమైన స్పందన వచ్చింది. ఇక పుష్ప-2 ది రూల్‌ నుండి రానున్న ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా అంతే క్రేజీతో రాబోతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో వున్న ఈ చిత్రం, మరోవైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌హాఫ్‌ పర్‌ఫెక్ట్‌ లాక్ అయిన సంగతి తెలిసిందే. కంటెంట్‌ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా పుష్ప-2 అత్యున్నత స్థాయిలో వుండబోతుంది. ఇక డిసెంబరు 6న అందరూ పుష్ప ది రూల్‌ డే అని ఎదురుచూస్తున్నారు..
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కథ-కథనం-దర్శకత్వం: సుకుమార్.బి
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
సినిమాటోగ్రాఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
లిరిసిస్ట్: చంద్రబోస్
సీఈఓ: చెర్రీ
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్–

Tfja Team

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

3 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

3 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

4 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

4 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

4 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

6 days ago