మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మాతలుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆగస్ట్ 15న రిలీజైంది. తొలి ఆట నుంచే ఈ ఫన్ ఎంటర్ టైనర్ ‘ఆయ్’ ప్రేక్షకాదరణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేటర్స్‌లో సందడి చేస్తోంది. సినీ ప్రేక్షులు, విమర్శకుల ప్రశంసలతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ‘ఆయ్’ సినిమాను చూసి అద్భుతమంటూ చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఇప్పటికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నాగ చైతన్య, సాయిపల్లవి చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా కలిసి విషెష్ అందించారు.
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆయ్’ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా కలుసుకుని, సినిమా సాధించిన సక్సెస్‌పై ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హీరో నార్నే నితిన్, నిర్మాతలు బన్నీవాస్, విద్యా కొప్పినీడి, దర్శకుడు అంజి కె మణిపుత్ర, హీరోయిన్ నయన్ సారిక, అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తొలి ఆట నుంచి మంచి మౌత్ టాక్ తో వరుసగా షోలు, స్క్రీన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సినిమా చూసి ఓ చక్కని సినిమాను చూశామనే ఫీలింగ్‌తో జనాలు బయటకు వస్తున్నారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ ఆధారణపై చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అలాగే రోజు రోజుకి సినిమా కలెక్షన్స్ పెరుగుతుంది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన…
తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్…
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త…
ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్.టి.ఆర్) వ్యక్తిత్వ మరియు ప్రచార హక్కులను రక్షణ కల్పించేలా గౌరవనీయ ఢిల్లీ హైకోర్టు…
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…