టాలీవుడ్

తేజ గారి డైరెక్షన్ లో లాంచ్ కావడం నా అదృష్టం : గీతికా

తేజ గారి డైరెక్షన్ లో లాంచ్ కావడం నా అదృష్టం. ‘అహింస’ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ: గీతికా తివారీ

వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ గీతికా తివారీ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  

మీ నేపధ్యం గురించి చెప్పండి ?
మాది మధ్య ప్రదేశ్, జబల్పూర్. గ్రాడ్యుయేషన్ తర్వాత కెరీర్ మొదలు పెట్టాను. మొదట కొన్ని కమర్షియల్ యాడ్స్ చేశాను. తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. నాకు టాలీవుడ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడిషన్స్ ఇచ్చే క్రమంలో తేజ గారిని కలిశాను. ఈ సినిమా ఆడిషన్స్ కి పిలిచారు. సెలెక్ట్ అయ్యాను. కొత్త వారిని పరిచయం చేయడంలో తేజ గారిది లక్కీ హ్యాండ్. ఆయన సినిమా ద్వారా లాంచ్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను.

తేజ గారు అహింస కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
తేజ గారు మొదట నాకు కథ అంతా చెప్పలేదు. పేరాగ్రాఫ్ చెప్పారు. నేను చేసిన అహల్య పాత్ర గురించి చెప్పారు. చాలా కీలకమైన పాత్ర. తను చాలా కష్టాలు ఎదురుకుంటుంది. ఆ పాత్ర ప్రయాణం నాకు చాలా నచ్చింది. ఛాలెజింగా అనిపించింది. తేజ గారు హీరోయిన్ ని చాలా అద్బుతంగా చూపిస్తారు. ఇందులో హీరోయిన్ పాత్ర కూడా తేజ గారి మార్క్ లో వుంటుంది.

అహింస లో మీ పాత్ర ఎలా వుంటుంది ?
ఇందులో నా పాత్ర పేరు అహల్య. అమాయకత్వం నుంచి స్ట్రాంగ్ అండ్ పవర్ ఫుల్ గా ఎదిగిన పాత్ర. తనకి ప్రేమపై నమ్మకం వుంటుంది. ఈ సినిమా కుటుంబం, కల్చర్, నేచర్ తో కనెక్ట్ అయి వుంటుంది. అహింస ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్.

అభిరామ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించిది ?
అభిరామ్ మల్టీ టాలెంటెడ్. చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తేజగారు ఎన్ని టేక్స్ తీసుకున్నా సరే..  పెర్ఫెక్ట్ గా వచ్చే వరకు చాలా ఓపికతో వుంటారు. అభిరామ్ గుడ్ కోస్టార్.

ఆర్పీ పట్నాయక్ గారి మ్యూజిక్ గురించి ?
అహింస లో వండర్ ఫుల్ మ్యూజిక్ వుంది. ఇందులో నాలుగు పాటలు వున్నాయి. పాటలన్నీ చాలా బావొచ్చాయి. ఇందులో నీతోనే నీతోనే పాట నా ఫేవరేట్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం.  

అహింసలో మిగతా నటీనటులు గురించి ?
అహింసలో సదా గారు అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. చాలా  స్ట్రాంగ్ రోల్ అది. అలాగే రజత్ బేడీ, మనోజ్ టైగర్ బలమైన ప్రతినాయకులుగా కనిపిస్తారు.

‘అహింస’ని విలేజ్ లో షూట్ చేశారా ?
అహింస షూటింగ్ 90 శాతం మధ్య ప్రదేశ్ లోని అడవీ ప్రాంతంలో జరిగింది. చాలా ఇంటెన్స్ లోకేషన్స్ ఇందులో కనిపిస్తాయి. యూనిట్ అంతా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు.

సహజంగా హీరోయిన్స్ కి కమర్షియల్ పాత్రలు చేయాలని వుంటుంది.. మీ ప్రాధాన్యత ఏమిటి ?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని వుంటుంది. ఒక్క జోనర్ కి పరిమితం కాకుండా అన్నీ రకాల సినిమాలు, పాత్రలు చేయాలని వుంది.

ఆల్ ది బెస్ట్
థాంక్స్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

4 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago