రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” నుండి “ఐ లవ్ యు” లిరికల్ సాంగ్ విడుదల
తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నిర్మాతలు రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు.
యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఐ లవ్ యు” లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ పాట మధురమైన సంగీతం, చక్కని సాహిత్యంతో హృదయాలను ఆకర్షిస్తుంది. రెహమాన్ రచించిన ఈ చిత్ర గీతాన్ని యాజిన్ నిజర్, నూతన్ మోహన్ పాడారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. “ఐ లవ్ యు” అనే పాట చిత్ర బృందం యొక్క అంకితభావం మరియు కృషికి నిదర్శనం. చిత్ర నాయికా నాయకులపై చిత్రీకరించ బడ్డ ఈ గీతం యువతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.
ఈ పాట విడుదలకు ముందే విడుదల అయిన
రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి టీజర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధ మవుతోంది.
తారాగణం:
కథానాయకుడు: రవితేజ నున్నా
కథానాయిక: నేహా జురెల్
ఇతర ప్రధాన పాత్రలలో నాగినీడు,ప్రమోదిని
జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి
యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర
గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు
శ్రావణి
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…