‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్‌గా అనిపించే యూత్‌ఫుల్‌ చిత్రం టీజర్‌ ఆవిష్కరణలో ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు

Must Read

అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు విడుదల చేస్తున్నాయి. కాగా ఈ చిత్రం టీజర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌ బాబు మాట్లాడుతూ ” నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ ”హుషారు పిట్టలు’ సినిమా గురించి చెప్పాడు. సినిమా చూడగానే వెరీ రియలిస్టిక్‌ యంగ్‌స్టర్‌ సినిమా అనిపించింది. నేటి యువతరం కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. సినిమాలో నటీనటులు అందరూ బాగా చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికి నచ్చుతుంది’ అన్నారు.

హీరో అన్షు మాట్లాడుతూ ” అందరం ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ సినిమాలో మాసినపల్లి రవి పాత్ర చేశాను. టీజర్‌ లాగే సినిమా కూడా అందరికి నచ్చుతుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయమైనందుకు సంతోషంగా ఉంది. తప్పకుండా హిట్‌ కొడతాం’ అన్నారు.

హీరోయిన్‌ వాసవి గణేషన్‌ మాట్లాడుతూ ” టీజర్‌కు మంచి సినిమా ఉంటుంది. నాకు తొలిసినిమా. నా పాత్ర తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అన్నారు.

దర్శకుడు బిక్షు మాట్లాడుతూ ” 16 సంవత్సరాలు కష్టపడి ఈ స్టేజ్‌కు వచ్చాను. ఈ రోజు దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ అండ్‌ ఏషియన్‌ ఫిలింస్‌ వారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా గురించి ఏమీ తెలియని నేను అన్ని నేర్చుకుని ఓ సినిమాకు దర్శకత్వం వహించడం ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు విడి విడిగా చూడాల్సిన కుటుంబ కథా చిత్రం. తప్పకుండా నేటి యువతకు హుషారు తెప్పిచే చిత్రం ఇది. నా రియల్‌లైఫ్‌లో నా చుట్టుప్రక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాను. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన తరువాత అందరూ థ్రిల్ల్‌ అయ్యి షాక్‌ అయ్యి ఔట్‌ అవుతారు’ అన్నారు.

ప్రముఖ నిర్మాత బెక్కం వేణగోపాల్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాను సైలెంట్‌గా కంప్లీట్‌ చేసి ఈ సినిమా నాకు చూపించారు. సినిమా చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చూడగానే నాకు షాకింగ్‌గా అనిపించింది. ఫస్టాఫ్‌ యూత్‌ఫుల్‌ కంటెంట్‌తో వెళ్లిన సెకండాఫ్‌లో ఓ మెచ్యూర్డ్‌ కంటెంట్‌ ఉంది. ఇది డెఫినెండ్‌గా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా యూత్‌కు, తల్లిదండ్రులకు దర్శకుడు ఏదో విషయం చెబుతున్నాడు. ఈసినిమా చూసిన తరువాత అందరూ రెస్పాన్సబుల్‌గా ఫీలవుతారు. ఓ మంచి విషయాన్ని ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో ఈ సినిమాలో దర్శకుడు చెప్పాడు. ఆర్టిస్టులు కూడా ఎంతో నేచురాల్‌గా ఉంటుంది. సినిమా మీద పాషన్‌ ఉన్న దర్శకుడు సురేష్‌ ప్రొడక్షన్ష్‌ సురేష్‌బాబు, జగదీష్‌గారికి నచ్చింది అందుకే వాళ్లు రిలీజ్‌చేస్తున్నారు. మంచి సినిమా కాబట్టి నేను కూడా సపోర్ట్‌ చేస్తున్నాను. కంటెంట్‌ నచ్చితే సురేష్‌బాబు సపోర్ట్‌చేయడం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఇది సక్సెస్‌ఫుల్‌ సినిమా’ అన్నారు.

నిర్మాత కె.వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ ” ఈ సినిమాను ఎంతో ఇష్టపడి తీశాను. ఏడు సంవత్సరాలుగా ఉన్న అనుభవంతో ఈ సినిమా నిర్మించాను. ఈ సినిమా లైన్‌ను నచ్చి ఈ సినిమా నిర్మించడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాలో అందరూ ప్రతిభ గల వారు. అందరూ ఈ సినిమాను సొంత సినిమాలా భావించి నిర్మించారు. నిజాయితీగా ఉంటే సక్సెస్‌ వస్తుందనే నమ్మకం నాకుంది. చాలా మంది తల్లిదండ్రులకు, యూత్‌కు ఈ సినిమాలో మేసేజ్‌ ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వేలో తీశాం. మీ అందరిని సినిమా అలరిస్తుంది’ అన్నారు.

చిన్ని చరణ్‌ మాట్లాడుతూ ” హుషారు పిట్టలు సినిమా సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా విడుదల చేయడం హ్యపీగా ఉంది. భవిష్యత్‌లో ఈ చిత్ర దర్శకుడు బిక్షు పెద్ద దర్శకుడు అవుతాడు. సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. యూత్‌ ఈ సినిమా చూసి ఉర్రూతలూగుతారు. నేను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న సినిమా ఇది. హుషారు పిట్టలు సినిమా నన్ను మాస్‌ కమర్షియల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిలబెడుతుంది’ అన్నారు.

అన్షు, వాసవి గణేషన్‌, గోవర్థన్‌, సునీత్‌ మనోహర్‌, రమేష్‌, బలగం బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌-అర్జున్‌

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News