యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు భారీ చిత్రాల్లో నటిస్తూ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉంది నిధి. హరి హర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో జరుగుతోంది. ఉదయం 6 గంటల నుంచే షూటింగ్ ప్రారంభమవుతోంది.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హరి హర వీరమల్లు షూటింగ్ లో పాల్గొంటున్న నిధి అగర్వాల్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చి ఇక్కడ సాయంత్రం రాజా సాబ్ చిత్రీకరణలో జాయిన్ అవుతోంది.
ఇలా ఒక రోజులో ఈ రెండు సినిమాల షూటింగ్స్ చేస్తూ తీరిక లేకుండా ఉంది నిధి అగర్వాల్. హరి హర వీరమల్లు సినిమా ఒప్పందంలో భాగంగా తనకు ఈ మధ్యలో వచ్చిన మూవీస్ కు సైన్ చేయలేక వదిలేస్తోంది నిధి అగర్వాల్. అయితే హరి హర వీరమల్లు సినిమా తనకు కోల్పోయిన మూవీస్ కంటే ఎక్కువగా గుర్తింపు, విజయాన్ని తీసుకొస్తుందని ఆమె నమ్ముతోంది. నిధి అగర్వాల్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుపుతోంది.
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…