ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా ఉండేలా ‘వార్ 2’ కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది – అయాన్ ముఖర్జీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘వార్2’. YRF స్పై యూనివర్స్‌ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతోన్న ఈ ఆరవ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందిస్తోన్న YRF లేటెస్ట్ మూవీ వార్ 2 గురించి చిత్ర దర్శకుడు అయాన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇండియన్ సినిమాలో ఐకానిక్ స్టార్స్ అయిన హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అనేది అందరినీ ఆకర్షించేలా కథను రూపొందించటంలో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజీని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకుని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తాను. వార్2 ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీలో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆనందం ఉండదు. ఆల్ రెడీ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను ముందుకు తీసుకెళుతున్నప్పుడు దానికంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరి సూపర్ స్టార్స్ ఫ్యాన్స్‌ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయతీగా చెప్పాలంటే ఓ దర్శకుడిగా ఇలాంటి భావనను కలిగించటానికి పూర్తిగా నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా వార్2 చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అనేది అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలను రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒకచోటికి చేరేలా వార్2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందోనని అభిమానులు, ప్రేక్షకులు ఎగ్జయిటెడ్‌గా ఉంటారో, వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్‌కు వచ్చినప్పుడు వారికి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌లా ఈ సినిమా ఉండాలనే ఆలోచించి రూపొందించాం’’ అన్నారు.

ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేసుకునేలా వార్2 చిత్రాన్ని తెరకెక్కించాం. హృతిక్, ఎన్టీఆర్ కలయికలో గూజ్ బమ్స్ తెప్పించే సన్నివేశాలతో గొప్ప థియేట్రికల్ అనుభవాన్ని ఈ సినిమా అందిస్తుంది.

‘వార్ 2’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

15 hours ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

15 hours ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

15 hours ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

15 hours ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

15 hours ago