YRF నిర్మాణంలో ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సంచలనం.. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా $100Kతో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం
YRF స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ‘వార్ 2’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్, క్రేజ్‌ని చాటేలా ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే $100K డాలర్లు క్రాస్ అయింది. ప్రీ సేల్స్‌తోనే ‘వార్ 2’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర అమెరికా మార్కెట్లో USD 100,000 ముందస్తు టిక్కెట్ల అమ్మకాలను దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా ‘వార్ 2’ నిలిచింది.
కేవలం ఏడు గంటల్లోనే ఈ ఘనతను ‘వార్ 2’ సాధించింది. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే మైలురాయిని చేరుకోవడానికి ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి 11 గంటల 37 నిమిషాలు పట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ వార్ 2తో ఎన్టీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఊపిరి ఊయలలాగా’ అనే పాట సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇక ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘వార్ 2’ భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
· కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాల ఏర్పాటుతో 1,050 మందికి ఉపాధి అవకాశాలు ·…
శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ మరియు సుఖ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘డైరెక్టెడ్ బై చార్లీ చాప్లిన్’ చార్లీ చాప్లిన్…
రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘లెనిన్’ చిత్రంలో అద్భుతమైన నటనతో కన్నడ నటుడు ప్రమోద్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కన్నడలో హీరోగా…
యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డేంజర్ బాయ్స్’ (చాప్టర్ క్లోజ్). వికాస్,…
యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". ఈ సినిమాలో రాకేష్ వర్రే…
ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న హిలేరియస్ అడ్వెంచర్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి సూపర్…