$100Kతో రికార్డ్ క్రియేట్ చేసిన‘వార్ 2’ చిత్రం

YRF నిర్మాణంలో ఇండియన్ ఐకానిక్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సంచలనం.. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా $100Kతో రికార్డ్ క్రియేట్ చేసిన చిత్రం

YRF స్పై యూనివర్స్ నుంచి రాబోతోన్న ‘వార్ 2’ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్, క్రేజ్‌ని చాటేలా ప్రీ సేల్స్ జరుగుతున్నాయి. ‘వార్ 2’ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ఇప్పటికే $100K డాలర్లు క్రాస్ అయింది. ప్రీ సేల్స్‌తోనే ‘వార్ 2’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఉత్తర అమెరికా మార్కెట్లో USD 100,000 ముందస్తు టిక్కెట్ల అమ్మకాలను దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా ‘వార్ 2’ నిలిచింది.

కేవలం ఏడు గంటల్లోనే ఈ ఘనతను ‘వార్ 2’ సాధించింది. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే మైలురాయిని చేరుకోవడానికి ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి 11 గంటల 37 నిమిషాలు పట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ వార్ 2తో ఎన్టీఆర్ తన రికార్డును తానే తిరగరాశారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఊపిరి ఊయలలాగా’ అనే పాట సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇక ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘వార్ 2’ భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

Tfja Team

Recent Posts

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…

7 days ago

అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’ రిలీజ్, ఈ నెల 26న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…

2 weeks ago

‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది.. మంచి అనుభూతితో థియేటర్ నుంచి బయటకు వస్తారు – దర్శకుడు మురళీకాంత్

వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్…

2 weeks ago

డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్‌ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…

2 weeks ago

‘ఎర్రచీర’పక్కాగా ఫిబ్రవరి 6న విడుదల

బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…

2 weeks ago

ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్‌కు ఫుల్ ఫన్ గ్యారంటీ!

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…

2 weeks ago