‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్న నిర్మాతలు, అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. నిర్మాతల నమ్మకం నిజమై మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. షో షోకి వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, “సోషల్ మీడియాలో ఎక్కడా సినిమా గురించి ఒక్క నెగటివ్ కామెంట్ కూడా కనిపించలేదు. అంతలా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడం కోసం మీడియా ముందుకి వచ్చాము. థాంక్స్ అనేది చాలా చిన్న మాట. సినిమా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలుగుతోంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.” అన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి, “నాగవంశీ గారు ఈ సినిమా మీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందే వంశీ చెప్పారు.. సినిమాకి ఎక్కడైనా నెగటివ్ కామెంట్ వస్తే అడగండని. అయితే ఈస్థాయి స్పందన లభిస్తుందని నేను కూడా ఊహించలేదు. ప్రీమియర్ షోల నుంచే సినిమాకి ఎంతో మంచి టాక్ వచ్చింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దర్శకుడిగా ఇంత మంచి పేరు రావడమనేది చాలా అరుదైన విషయం. ఈ సినిమా పట్ల మీడియా మద్దతుకి, ప్రేక్షకుల ఆదరణకి చాలా చాలా థాంక్స్. పండగ అయినా కూడా మొదటిరోజు మంచి వసూళ్లు రావడం సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తుంది. మలయాళం ప్రేక్షకులు దీనిని డబ్బింగ్ సినిమాలా చూడటంలేదు. సొంత సినిమాగానే భావిస్తున్నారు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని సినిమా చూసిన ప్రేక్షకులు సంతృప్తి చెందుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అనే తేడా లేకుండా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ దేవుని ఆశీస్సులతోనే సినిమాకి ఈ స్థాయి ఆదరణ లభిస్తోందని నమ్ముతున్నాను.” అన్నారు.
నటుడు రాజ్ కుమార్ కశిరెడ్డి మాట్లాడుతూ, “దుల్కర్ సల్మాన్ గారి స్నేహితుడి పాత్ర కోసం వెంకీ గారు నన్ను తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కసిరెడ్డి కొత్తగా కనిపించాడు అని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంది. అదే సమయంలో.. నా స్నేహితులు, తెలిసినవాళ్ళు సినిమా చూసి, ఫోన్ చేసి.. ముందు నా పాత్ర గురించి మాట్లాడట్లేదు. దర్శకుడు సినిమా అద్భుతంగా తీశాడని చెబుతున్నారు. సినిమా చూసి ఒక దర్శకుడి గురించి అలా మాట్లాడటం అనేది, నిజంగా గొప్ప విషయం.” అన్నారు.
ఈ సందర్భంగా మీడియా నుంచి ఎదురైన పలు ఆసక్తికర ప్రశ్నలకు నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు వెంకీ అట్లూరి సమాధానమిచ్చారు.
దర్శకుడు వెంకీ అట్లూరి:
నిర్మాత సూర్యదేవర నాగవంశీ:
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ…
స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్…
క్రీడా గాయాలు, ఆర్థోపెడిక్ సమస్యలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అపోలో హాస్పిటల్లో “అపోలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
"సంతాన ప్రాప్తిరస్తు" చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో విక్రాంత్..ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ…