న్యూ ఇయర్ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

Must Read

నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం హీరో హీరోయిన్స్ గా జి సినిమా బ్యానర్ పై నేలబల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు నిర్మిస్తున్న సినిమా “రుక్మిణి”. ఈ చిత్రానికి శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. సరికొత్త హారర్ కామెడీ కథతో దర్శకుడు సింహాచలం గుడుపూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు న్యూ ఇయర్ డే సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా “రుక్మిణి” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేశారు. అనంతరం

నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – గంగాధర్ నాతో ఎన్నో ఏళ్లు పనిచేశాడు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం వంటి ఎన్నో హిట్ మూవీస్ కు మాతో వర్క్ చేశాడు. నాకు మంచి స్నేహితుడైన ఆయన నిర్మాతగా “రుక్మిణి” సినిమా చేయడం హ్యాపీగా ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా చిన్న సినిమా ఆదరణ పొందినప్పుడే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. చిన్న చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకునే నటుడిని నేను. ఈ సినిమాలో  నిరంజన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ “రుక్మిణి” సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా అన్నారు.

హీరో నిరంజన్ మాట్లాడుతూ – మా “రుక్మిణి” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారికి థ్యాంక్స్. మా యంగ్ టీమ్ అంతా కలిసి ఒక మంచి మూవీ చేస్తున్నాం. హారర్ కామెడీ జానర్ లో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా “రుక్మిణి” సినిమా ఉంటుంది. సంక్రాంతికి టీజర్ తో మీ ముందుకు వస్తాం. మా టీమ్ కు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు.

హీరోయిన్ గ్రీష్మ నేత్రికా మాట్లాడుతూ – మళ్లీశ్వరి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నన్ను మీరంతా ఆదరించారు. ఇప్పుడు “రుక్మిణి” సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు వస్తున్నాను. మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రాజేంద్రప్రసాద్ గారు లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ను మేము ఎంత ఎంజాయ్ చేస్తూ చేశామో, మీరు సినిమా చూస్తున్నప్పుడు అంతే ఎంజాయ్ చేస్తారు అన్నారు.

నటుడు విఖ్యాత్ మాట్లాడుతూ – మా “రుక్మిణి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ సినిమాలో నేను ఒక కీ రోల్ ప్లే చేశాను. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కు థ్యాంక్స్. సంక్రాంతికి “రుక్మిణి” టీజర్ ను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు.

నటుడు జయంత్ మాట్లాడుతూ – “రుక్మిణి” సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ లో నటించాను. ఈ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో రూపొందుతోంది అన్నారు.

నిర్మాత కట్టా గంగాధర్ రావు మాట్లాడుతూ – ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. “రుక్మిణి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో రిలీజ్ చేయించుకోవడం హ్యాపీగా ఉంది. ఆయనతో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆయన మూవీస్ కు నేను వర్క్ చేశాను. మంచి కంటెంట్, కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న “రుక్మిణి” సినిమాను మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా అన్నారు.

డైరెక్టర్ సింహాచలం గుడుపూరి మాట్లాడుతూ – సరికొత్త హారర్ కామెడీ కథతో “రుక్మిణి”  సినిమాను రూపొందిస్తున్నాం. కామెడీ అంటే రాజేంద్రప్రసాద్ గారు గుర్తుకువస్తారు. ఆయన చేతుల మీదుగా మా “రుక్మిణి” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. మీ అందరికీ న్యూ ఇయర్ విశెస్ చెబుతూ మా సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం అన్నారు.

నటీనటులు – నిరంజన్, గ్రీష్మ నేత్రికా , ప్రియాంక, దీప్తి శ్రీరంగం, సింహ, విఖ్యాత్, జయంత్, తదితరులు

టెక్నికల్ టీమ్
———–
ఎడిటర్ – శ్రీకృష్ణ అట్టలూరి
డీవోపీ – తరుణ్ రావుల
మ్యూజిక్ డైరెక్టర్ – సుభాష్ ఆనంద్
సమ్పరణ – శ్రీమతి నేలబల్లి కుమారి సమర్పించు
బ్యానర్ – G సినిమా
ప్రొడ్యూసర్స్ – నేలబల్లి సుబ్రమణ్యం రెడ్డి, కట్టా గంగాధర రావు
రచన, దర్శకత్వం – సింహాచలం గుడుపూరి                                                

పీఆర్ఓ – చందు రమేష్

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News