చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ తో థియేటర్ల సంఖ్య పెరుగుతోంది. 50 స్క్రీన్ తో నిన్న రిలీజైన “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమా అదే రోజు 70 స్క్రీన్ కు చేరింది. టాక్ బాగుండటంతో బీ, సీ సెంటర్ లో డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిజల్ట్ పట్ల హ్యాపీగా ఉన్నారు. బీ, సీ సెంటర్ లో కొత్త థియేటర్స్ యాడ్ అవుతున్నాయి.
“హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాలో దర్శకుడు బాల రాజశేఖరుని చూపించిన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, కథను తెరకెక్కించిన విధానం, కాంటెంపరరీ స్టోరీని అందరికీ నచ్చేలా ప్రెజెంట్ చేసిన పద్ధతి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. క్రిటిక్స్ నుంచి కూడా ఈ సినిమాకు అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. మూవీ లోని నాలుగు పాటలు బాగున్నాయనే పేరొచ్చింది. హెబ్బా పటేల్, చైతన్య రావ్ జంట కొత్తదనం అందిస్తోంది. ద్వితీయార్థంలో వచ్చే వీరి రొమాంటిక్ సాంగ్ మూవీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనికెళ్ల భరణి, సుహాసినీ పెయిర్ కూడా కథలో కీలకంగా ఉండి ఆకట్టుకుంటోంది.
దర్శకుడు బాలరాజశేఖరుని ఓ మంచి సినిమా చేస్తాడనే నమ్మకం తో “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాకు నాగార్జున, అమల, రాఘవేంద్రరావు, విజయేంద్రప్రసాద్, ఆర్జీవీ, అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ వంటి స్టార్స్ ప్రమోట్ చేశారు. వారి నమ్మకం ఆడియన్స్ ఆదరణతో నిజమవడం పట్ల మూవీ టీమ్ హ్యాపీగా ఉన్నారు. “హనీమూన్ ఎక్స్ ప్రెస్” సినిమాను న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మించారు.
నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు
సంగీతం : కళ్యాణి మాలిక్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్
లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ
ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె
ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి
ఆడియో : టి సిరీస్
పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్)
డిస్ట్రిబ్యూటర్లు: సుచిన్ సినిమాస్.
రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…