ఉగ్రమ్ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బఘీర’తో అలరించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కథ అందించారు. డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈరోజు మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.
దేవుని అవతారాల గురించి తల్లి, ఆమె కొడుకు మధ్య సీరియస్ సంభాషణతో ట్రైలర్ ప్రారంభమైంది. అరాచకాలని అంతం చేయడానికి దేవుడు అనేక రూపాల్లో వస్తాడని, దేవుడి లానే కాదు రాక్షసడిలా కూడా రావచ్చని చెబుతుంది. నేరస్థులను నిర్మూలిస్తున్న మాస్క్ మ్యాన్ బఘీరని స్థానికులకు దేవుడి రూపంలో, పోలీసులు అతన్ని క్రిమినల్ గా చూస్తారు.
ప్రశాంత్ నీల్ పవర్ ఫుల్ కథను రాశాడు, డాక్టర్ సూరి గ్రిప్పింగ్ నేరేషన్, ఇంపాక్ట్ఫుల్ సంభాషణలతో ప్రజెంట్ చేశాడు. శ్రీమురళి పోలీసు అధికారిగా, మాస్క్ మ్యాన్ బఘీరగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రుక్మిణి వసంత్ అతని లవ్ ఇంట్రస్ట్ గా కనిపించారు. ట్రైలర్‌లో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి ప్రముఖ నటులను కూడా పరిచయం చేశారు.
AJ శెట్టి సినిమాటోగ్రఫీ అద్భుతంగా వుంది. B అజనీష్ లోక్‌నాథ్ థంపింగ్ స్కోర్‌తో యాక్షన్ ని ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువలు ఫస్ట్-క్లాస్ గా వున్నాయి. ఈ చిత్రానికి ఎడిటర్‌గా ప్రణవ్ శ్రీ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి సంతేహక్లు పని చేస్తున్నారు.
ట్రైలర్‌తో భారీ అంచనాలు పెంచిన బఘీర అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తారాగణం: శ్రీమురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: విజయ్ కిరగందూర్
బ్యానర్: హోంబలే ఫిల్మ్స్
కథ: ప్రశాంత్ నీల్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ సూరి
తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: AJ శెట్టి
సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్
యాక్షన్: చేతన్ డి సౌజా
ఆర్ట్ డైరెక్టర్: రవి సంతేహక్లు
పీఆర్వో: వంశీ-శేఖర్
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…