హే భగవాన్‌ నవ్విస్తుంది.. హృదయానికి హత్తుకుంటుంది: సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిర్మాత వంశీ నందిపాటి విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

‘హేభగవాన్‌’ ఎలాంటి సినిమా?
హేభగవాన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా.. స్టోరీ లెవల్‌ నుంచి ఈ ప్రాజెక్టులో ఉన్నాను. ప్రజెంటర్‌గా ఉన్నాను. ఈ సినిమా పాయింట్‌లో ఫన్‌ ఉంటుంది. సినిమాలో బిజినెస్‌ అనేది ఒక ఎలిమెంట్‌ ఉంది. ఒక కొడుకు తన తండ్రి గురించి అర్థం చేసుకోవడానికి ఆ ఎలిమెంట్‌ ఉపయోగపడుతుది. ఫన్‌ ప్లస్‌ ఎమోషన్‌ ఈ సినిమాలో ఉంటుంది. ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించడంతో పాటు హృదయానికి హత్తుకునే సినిమా ఇది.

సినిమా ట్రైలర్‌, టీజర్‌లో బిజినెస్‌ అంటూ ఓ ఆసక్తికరమైన టాపిక్‌ పెట్టారు ఎందుకని?
ఆసక్తి, బజ్‌ పెంచడానికి అలా పెట్టాం. అయితే ఆ బిజినెస్‌ ఏమిటనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు.

‘హేభగవాన్‌’ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?
సినిమాలో ఫాదర్‌ పాత్ర పేరు భగవాన్‌ అందుకే హే భగవాన్‌.. టైటిల్‌ పెట్టాం. అయితే తాజాగా సెన్సారు అభ్యంతరం వల్ల టైటిల్‌ మారే అవకాశం ఉంది. సెన్సిటివ్‌ టైటిల్‌ అంటున్నారు. గతంలో ఇలాంటి టైటిల్స్‌ వచ్చాయి. కానీ ఇప్పుడు వద్దు అంటున్నారు.సెన్సారు బోర్డు వాళ్లతో చర్చలు జరగుతున్నాయి. ఒకవేళ హే భావన్‌గా మారే అవకాశం ఉంది.

సుహాస్‌కు ఈ సినిమా ఎంత వరకు ప్లస్‌ అవుతుంది?
గత కొంతకాలం నుంచి సుహాస్‌ ఎదురుచూస్తున్న కమర్షియల్‌ సక్సెస్‌ ఈసినిమాతో సాధించబోతున్నాడు. ఖచ్చితంగా ఆయన కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌గా నిలుస్తుంది. ఈసినిమా ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుంది.

సత్యదేవ్‌తో, శ్రీవిష్ణుతో కూడా సినిమాలు ఉన్నాయి.

సినిమా పూర్తియన తరువాత మీరు సినిమాలను మంచి బజ్‌ తీసుకొచ్చి విడుదల చేస్తున్నారు? మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది?
ప్రొడ్యూసర్‌గా మీ స్ట్రాటజీ ఏమిటి?
మోర్‌ దెన్‌ ప్రాపర్‌గా క్రియేటివ్‌ స్ట్రాటజీస్ట్‌గా అనేది కరెక్ట్‌ పదం. అన్నీ దగ్గరుండి అన్నీ చూసుకుంటాను. దర్శకుడికి ఎక్కడైనా అనిపించిన దగ్గర సలహా ఇస్తాం. వాళ్లు ఓకే అంటేనే మార్పులు చేశాం. దర్శకుడు హ్యపీ అయితే సినిమా బాగుంటుందనేది నా నమ్మకం. మొత్తం వాళ్ల అనుమతి మేరకే జరుగుతుంది.

మీరు చెప్పిన మార్పులకు దర్శకులు ఎలా కన్వీన్స్‌ అవుతున్నారు?

క్రియేటివి ఫ్రీడమ్‌ దర్శకులకే. కన్వీన్సింగ్‌గా చెప్పినట్లయితే వాళ్లు కూడా ఒప్పుకుంటారు. లేదా మాకు ముందు ఉన్న సక్సెస్‌లను కావొచ్చు. అయితే దర్శకుడికే పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి. కంటెంట్‌లో బలం ఉంటేనే మనం కూడా ఏమైనా చేయగలం.

ఇప్పుడు చిన్న సినిమాల నిర్మాణం బాగా తగ్గిందనుకోవచ్చా?
లిటిల్‌ హార్డ్స్‌, రాజు వెడ్ష్‌ రాంబాయ్‌ తరువాత చిన్న సినిమాలు పెరిగాయి. ఇటీవల ఛాంబర్‌లో ఒక నెలలోనే 300 సినిమాల టైటిల్స్‌ రిజిష్టర్‌ అయ్యాయి. ఓటీటీ బిజినెస్‌లు కావడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కేవలం ఓటీటీ కోసం కూడా చేసే సినిమాలు పెరిగాయి.

మీరు భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తారా?
దర్శకత్వం చేయను. నిర్మాతగా మంచి చిత్రాలు అందించాలనేది నా లక్ష్యం.
బన్నీ వాసు గారితో మీ అనుబంధం?
బన్నీ వాసుగారు నాకు బ్రదర్‌లాంటి వాడు. ఆయనతో మొదట్నుంచీ కలిసి ట్రావెల్‌ అవుతున్నాం. ఆయన ఓకే చేసిన నేను ఓకే చేసినట్లే..
మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేవిధంగా ఉంటాయి

పోలీమేర-3 డిటైల్స్‌ చెప్పండి?
పోలీమేర-3 ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఏప్రిల్‌ లేదా మేలో ప్రారంభింస్తాం. హిందీలో మినహా దక్షిణాది సినిమాల్లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఈ సినిమాకు లీడ్‌ రోల్‌లో ఎవరైనాస్టార్‌ యాడ్‌ అయితే బాగుంటుంది అనుకున్నాం. త్వరలోనే తెలియజేస్తాం.
మీ భవిష్యత్‌ ప్రణాళికలు?
ఈటీవీవిన్‌తో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తున్నాను. ఈ నెల 27 అది అనౌన్స్‌మెంట్‌ చేస్తాను. ఈటీవీతో మరికొన్ని ప్రాజెక్టులు చేస్తున్నాను.

శివాజీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని మీరు థియేటర్‌లో విడుదల చేస్తున్నారా?
మార్చి 6న ఆ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాను విడుదల చేస్తున్నాను.

TFJA

Recent Posts

“కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రభాస్ గారు ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరో సంతోష్ శోభన్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన "కపుల్ ఫ్రెండ్లీ" సినిమా ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు…

11 hours ago

‘బ్యాండ్ మేళం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’.…

11 hours ago

కపుల్ ఫ్రెండ్లీ మూవీని ప్రశంసిస్తూ ఇన్ స్టా పోస్ట్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ…

12 hours ago

పురుష: నుంచి చాటు చాటు సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న ట్యూన్

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘పురుష:’. పక్కా ఫ్యామిలీ…

12 hours ago

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామిని ఈఆర్ హీరోయిన్ గా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ “క్వీన్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్…

14 hours ago

రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ సినిమా టైటిల్, గ్లింప్స్ విడుద

దర్శకుడు డా. శైలేష్ కొలను, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా కోసం చేతులు కలిపారు. రోషన్…

14 hours ago