హే భగవాన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉంటుంది: నిర్మాత బి.నరేంద్ర రెడ్డి.

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్‌’ అనే ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బి.నరేంద్ర రెడ్డి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.


మీ నేపథ్యం ఏమిటి? సినిమాలపై ఆసక్తి ఎలా కలిగింది?
కడప జిల్లా లోని ప్రొద్దుటూరు నా స్వస్థలం. ప్రస్తుతం నేను బెంగుళూరులో కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే కన్నడంలో నిర్మాతగా ప్రవేశించాను. తెలుగులో నిర్మాతగా తొలిసినిమా ‘హే భగవాన్‌’

సినీ పరిశ్రమలోకి ఎలా ప్రవేశించారు?
కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలకు ఫైనాన్స్‌ ఇచ్చేవాడిని. ఇక సినిమాలంటే పాషన్‌తో నిర్మాతగా మారాను.

హేభగవాన్‌ ప్రాజెక్ట్‌ ఎలా సెట్‌ అయ్యింది?
మా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రమణా రెడ్డి ద్వారా ఈ కథ విన్నాను. హే భగవాన్‌ కంటే ముందు పది కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదు. ‘హే భగవాన్‌’ కథ వినగానే ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఆసక్తిగా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా ఉండే సినిమా ఇది.

ఈ సినిమా చేయడానికి ప్రధాన కారణం ఏమిటి? తొలి సినిమా అనుభవం ఎలా ఉంది?

స్టోరీ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. బడ్జెట్‌లోనే సినిమా జరిగింది. ప్రతిది ప్లానింగ్‌ ప్రకారమే వెళ్లాం. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంతా క్వాలిటీగా అవుట్‌పుట్‌ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్‌, సన్‌ ఎమోషన్‌ అందరి హృదయాలను హత్తుకుంటుంది.

సినిమా చూసిన తరువాత మీ ఫీలింగ్‌ ఏమిటి?
సినిమా కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్‌ అయ్యానో రేపు సినిమా చూసిన తరువాత కూడా ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్ల్‌ ఫీలవుతారు. ప్రతి సన్నివేశం ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఆసక్తిగా ఉంటుంది. సినిమాలో హీరో సుహాస్‌, నటుడు నరేష్‌, కమెడియన్ సుదర్శన్‌, వెన్నెల కిషోర్‌ ఇలా ప్రతి పాత్ర ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.

సినిమాలో ఇంటర్వెల్‌, పతాక సన్నివేశాల్లో ట్విస్ట్‌లు ఉంటాయా?
ఖచ్చితంగా ఆడియన్స్‌ ఊహకు అందని విధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. ప్రతి సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది.

బన్నీవాస్‌, వంశీ నందిపాటితో కలిసి ఈ సినిమా విడుదల చేయడం ఎలా ఉంది?
బన్నీ వాస్‌, వంశీతో ట్రావెల్‌ వంశీ మొదట్నుంచీ ఉంది. ఈ కథ గురించి వంశీ నందిపాటికి తెలుసు. ఆయనతో ట్రావెల్‌ అవుతున్నాను. వాళ్ల అసోసియేషన్‌తో ఈ సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది.

నిర్మాతగా మీ ఇన్‌వాల్వ్‌మెంట్‌ ఈసినిమాలో ఎంత వరకు ఉంటుంది?

క్రియేటివ్‌ ప్రాసెస్‌లో మా ఇన్‌వ్వాల్వ్‌మెంట్‌ ఏమీ వుండదు. కథ ఓకే చేయడం వరకు మన బాధ్యత, ఆతరువాత సినిమా బడ్జెట్‌లోనే జరగుతుందా? లేదా షూటింగ్‌ ఈ రోజే ఏం చేశారు? ఇలా ప్రతిది నిర్మాతగా చెక్‌ చేసుకుంటాను.

సినిమా నిర్మాణంతో పాటు ఓ కథను ఎంచుకుని సినిమా తీయడ, జడ్జ్‌ చేయడం రిస్క్‌ అనిపించటం లేదా?
రెండు గంటలు ఆడయన్స్‌ను కథ ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టరే. ఆడియన్‌ కథతో డిస్‌కనెక్ట్‌ కాకూడదు. నేను కథ వినేటప్పుడు కూడా ఇదే ఫాలో అవుతాను. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉంది. దీంతో నాకు నిర్మాణం పెద్ద రిస్క్‌ అనిపించడం లేదు.

ఈ సినిమా ద్వారా మీరు సంపాందించిన ఎక్స్‌పీరియన్స్‌?
2017 నుంచి ప్రొడక్షన్‌ బ్యాక్‌ ఎండ్‌లో ఉన్నాను. నాకు అనుభవం ఉంది. ప్రాపర్‌, ప్లానింగ్‌, డిసిప్లేన్‌తో ఉండటం, ప్రాపర్‌ గైడెన్స్‌తో సినిమా చేయడం నాకు తెలుసు. అందుకే నేను సినిమా నిర్మాణాన్ని కూడా ఇష్టంతోనే చేశాను.

మీకు ఎలాంటి సినిమాలు చేయడం అంటే ఇష్టం?

ఎమోషన్‌ మూవీస్‌ విత్‌ ఫన్‌వే సినిమాలు చేయాలని ఉంది. కన్‌స్ట్రక్షన్స్‌, సినిమా నిర్మాణానికి చాలా తేడా ఉంటుంది.

మీ తదుపరి సినిమా?
ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సత్యదేవ్‌ హీరోగా నటిస్తాడు. లక్ష్మీనారాయణ దర్శకుడు.
ఇప్పటివరకు సత్యదేవ్‌ టచ్‌ చేయని జోనర్‌లో అవుట్‌ అవుట్‌ అండ్‌ కమర్షియల్ మూవీ ఇది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ నటిస్తారు.

TFJA

Recent Posts

శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న విడుదల కాబోతోన్న ‘బ్యాండ్ మేళం’

‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది. బ్లాక్…

7 hours ago

టాలెంటెడ్ హీరో లెజెండ్ శరవణన్ “లీడర్” సినిమా టీజర్ రిలీజ్, ఏప్రిల్ లో గ్రాండ్ రిలీజ్ కు రాబోతున్న మూవీ

లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…

8 hours ago

ముందుగానే పవర్ స్టార్ తుఫాన్.. మార్చి 19న థియేటర్లలో అడుగుపెట్టనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

థియేటర్లో పవర్ స్టార్ తుఫాన్ కాస్త ముందుగానే రాబోతోంది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'…

14 hours ago

హోలీ శుభాకాంక్షలతో కంప్లీట్ ఎంటర్ టైనర్ “క్రేజీ కల్యాణం” మూవీ నుంచి బాల్ రాజ్ గా తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…

2 days ago

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్‌లో ఎంజాయ్‌ చేయాలి: ప్రీరిలీజ్‌ వేడుకలో అతిథులు.

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

2 days ago

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది: హీరోయిన్‌ లయ

మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…

2 days ago