“కపుల్ ఫ్రెండ్లీ” మూవీతో సంతోష్ శోభన్ కు సూపర్ హిట్ దక్కాలి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శ్రీవిష్ణు

సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా “కపుల్ ఫ్రెండ్లీ”. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్యాషనేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తున్నారు. గురువారం హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, మేర్లపాక గాంధీ, నందినీరెడ్డి, అభిలాష్ రెడ్డి, ప్రొడ్యూసర్ స్వప్న దత్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాను. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ చూస్తారు. ట్రైలర్ చూశాక సంతోష్ శోభన్ ఈ మూవీ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో అర్థమైంది. మానస వారణాసి అందంగా కనిపించడమే కాదు తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే క్రెడిట్ యూవీ క్రియేషన్స్ కు ఇవ్వాలి. అన్నారు.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ – ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్ ..ఏ కంటెంట్ రిలీజ్ చేసినా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అజయ్ అన్నలోని పాజిటివ్ ఎనర్జీనే ఈ మూవీకి వచ్చిందని అనుకుంటున్నాను. ఈ చిత్రంతో యూవీ సంస్థకు మంచి సక్సెస్ రావాలి. డైరెక్టర్ అశ్విన్ లోని హానెస్టీ ఈ సినిమా ప్రతి విజువల్ లోనూ కనిపిస్తోంది. సంతోష్ శోభన్ కు హిట్ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ – “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా గురించి ఆల్రెడీ ప్రతి ఒక్కరూ హిట్ అని చెబుతున్నారు. నేను థియేటర్ లో ప్రేక్షకుల మధ్యే చూడాలని అనుకుంటున్నా. మా యూవీ ప్రొడ్యూసర్స్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. నాతో భారీ బడ్జెట్ పెట్టి బైకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యూవీకి మంచి సక్సెస్ అందిస్తుంది. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – మనకు ఈ మధ్య లవ్ స్టోరీస్ తగ్గిపోయాయి. ఈ టైమ్ లో వస్తున్న అరుదైన ప్రేమ కథ ఇది. ప్రేమంటే ప్రేమలో పడిపోవడం కాదు. ప్రేమించిన వారిని నిలబెట్టడం. రియాల్టీకి దగ్గరగా ఉండే చిత్రమిది. ఈ సినిమా నేను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. ఈ రోజు పది చోట్ల ప్రీమియర్స్ వేస్తున్నాం. టికెట్స్ అన్నీ ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. మూవీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సక్సెస్ మీట్ లో మళ్లీ కలుద్దాం. అన్నారు.

డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ – మేమంతా హానెస్ట్ గా చేసిన చిత్రమిది. మిమ్మల్ని నిరాశపర్చదు. మంచి సినిమా చేశామని నమ్ముతున్నాం. మా మూవీకి కేవలం టైటిల్ వల్లే ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమాలో అలాంటి కంటెంట్ ఉండదు. ఏ అంటే మా దృష్టిలో ఆల్ అని అనుకుంటున్నాం. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

డైరెక్టర్ నందినీరెడ్డి మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్ చూశాక చాలా బాగుందంటూ సంతోష్ కు మెసేజ్ పంపాను. ప్రతి ఒక్కరికీ ఒక టైమ్ వస్తుందని అంటారు కదా అలా ఈ చిత్రంతో సంతోష్ శోభన్ టైమ్ మొదలవుతుంది. ఒక మంచి లవ్ స్టోరీ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. బ్యూటిపుల్ విజువల్స్, మ్యూజిక్ కుదిరాయి. సంతోష్, మానస జంట బాగున్నారు. ట్రైలర్ చూస్తే ఒక రియల్ లైఫ్ ప్రేమ జంటను చూస్తున్నట్లు అనిపించింది. డైరెక్టర్ అశ్విన్ సినిమాను చక్కగా డిజైన్ చేసుకున్నారు. సంతోష్ శోభన్ మంచి యాక్టర్. ఒక సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా అలాంటి సక్సెస్ అందించాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ మూవీ కంటెంట్ కొత్తగా అనిపిస్తోంది. సినిమా కావాల్సినవన్నీ యూవీ సంస్థ ఇస్తుంటుంది. వాళ్ల బ్యానర్ సినిమాలన్నీ నాకు ఇష్టం. సంతోష్ మా అందరికీ ఇష్టమైన యాక్టర్. అతనికి చాలా టాలెంట్ ఉంది. ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మా సంస్థ ద్వారా అలాంటి సినిమా ఇవ్వలేకపోయాం. కానీ కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.

హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఒక యంగ్, ఫ్రెష్ లవ్ డ్రామా. మేమంతా మనసు పెట్టి వర్క్ చేశాం. మా అజయ్ గారి వల్లే ఇక్కడ ఉన్నాం. ఎంతో డెడికేటెడ్ గా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు. ధీరజ్ గారు మా మూవీలోకి రావడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మా సినిమాకు ఆదిత్య బ్యూటిఫుల్ మ్యూజిక్ చేశారు. మిత్ర క్యారెక్టర్ ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అవుతారో చూడాలని ఆత్రుతగా ఉంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ కలిగింది. వాలెంటైన్స్ డే సీజన్ ఇది. ఈ సీజన్ లో కపుల్ ఫ్రెండ్లీ మూవీని ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రవీంద్రన్ మాట్లాడుతూ – ఇది నాకు ఫస్ట్ మూవీ. గతంలో డైరెక్టర్ అశ్విన్, నేను కలిసి షార్ట్ ఫిలింస్ కు వర్క్ చేశాం. ఇలాంటి ఒక మంచి మూవీకి మ్యూజిక్ చేస్తానని ఎక్స్ పెక్ట్ చేయలేదు. యూవీ సంస్థ ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మా సినిమాకు థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – కపుల్ ఫ్రెండ్లీ ఒక డీప్లీ ఎమోషనల్ మూవీ, సింపుల్ బ్యూటిఫుల్ మూవ్ మెంట్స్ తో ఆకట్టుకుంటుంది. మంచి క్యారెక్టర్స్, ఎమోషన్, హ్యూమర్ ఉన్న చిత్రమిది. డైరెక్టర్ అనిల్ అన్న గత మూడు వారాలు మనల్ని తన సినిమాతో నవ్వించాడు. ఈ నెల 14 నుంచి మా మూవీతో ఎమోషన్ ను కూడా ఫీల్ అవుదాం. ధీరజ్ మా టీమ్ లోకి రావడం హ్యాపీ. యూవీలో వచ్చే ప్రతి సినిమా మాదే అనుకుంటా. ఇది ఒక ఫ్యామిలీ లాంటి సంస్థ నాకు. మానస ప్రతిభ గల నటి. మా మూవీ చూశాక మీరంతా ఇదే విషయాన్ని చెబుతారు. థియేటర్స్ లో మీ అందరినీ కలుస్తాను. అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – యూవీ ప్రొడ్యూసర్స్ నాకు మంచి మిత్రులు. ఈ సినిమా ట్రైలర్ చూడగానే ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ష్యూర్ షాట్ హిట్ అనే ఫీల్ కలిగింది. అంత బ్యాలెన్స్డ్ గా మూవీ ఉంది. ఎమోషనల్ రైడ్ లా ఉంది. సంతోష్ శోభన్, మానస పర్పెక్ట్ పెయిర్ లా అనిపించారు. సంతోష్ కు మంచి హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కావాల్సింది ఒక సూపర్ డూపర్ హిట్. అది ఈనెల 14న ఈ సినిమాతో వచ్చేస్తుంది. వాలెంటైన్ డే స్లాట్ కి పర్పెక్ట్ టైమ్ కు పర్పెక్ట్ జానర్ లో వస్తున్న చిత్రమిది. థియేటర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి. కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ – యూవీ మూవీ అంటే నా సొంత సినిమాలా భావిస్తా. నేను ఈ సంస్థలో ఒక మూవీ చేశాను. ఈ బ్యానర్ లో అన్నీ బాగుంటాయి. మనల్ని ఎంతగానో లవ్ చేస్తారు. గోల్కొండ హైస్కూల్ సినిమా నుంచే సంతోష్ యాక్టింగ్ అంటే నాకు ఇష్టం. మంచి పర్ ఫార్మర్. నేచురల్ గా నటిస్తాడు. సినిమాల్లో కూడా మన ఇరుగు పొరుగు అబ్బాయిలా అనిపిస్తాడు. ఈ సినిమాతో ఆయనకు సూపర్ హిట్ దక్కాలని కోరుకుంటున్నా. మంచి యాక్టర్స్ ను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ లవ్ మీపై కూడా చూపిస్తారు. అనిల్ గారు ప్రతి సంక్రాంతికి సక్సెస్ ఇవ్వాలి. ఆయన ఇచ్చే సంక్రాంతి సక్సెస్ తో డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత మూడు నాలుగు నెలలు సినిమాలు బాగా కొంటున్నారు. కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, మ్యూజిక్, మిగతా అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – సంతోష్ శోభన్, మానస వారణాసి, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – మైఖేల్ బీఎఫ్ఏ
ఎడిటర్ – గణేష్ శివ
డీవోపీ – దినేష్ పురుషోత్తమన్
మ్యూజిక్ – ఆదిత్య రవీంద్రన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ఎస్ వర్మ
సమర్పణ – యూవీ క్రియేషన్స్
నిర్మాణం – యూవీ కాన్సెప్ట్స్, అజయ్ కుమార్ రాజు. పి.
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన, దర్శకత్వం – అశ్విన్ చంద్రశేఖర్

TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

17 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago